News January 16, 2026

సదర్ మట్ బ్యారేజ్‌ను ప్రారంభించిన సీఎం

image

మామడ మండలం పొన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై రూ.576 కోట్లతో నిర్మించిన సదర్ మట్ బ్యారేజ్‌ను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బ్యారేజ్‌కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిమోట్ ద్వారా గేట్లను ఓపెన్ చేశారు.

Similar News

News February 13, 2026

BIG BREAKING: నల్గొండ: తొలి మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్‌దే

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలి మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. నాగార్జునసాగర్ పరిధి నందికొండ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 1 వార్డు BRS గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News February 13, 2026

VKB: 31వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం

image

31వ వార్డు శివరాంనగర్ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ గౌడ్ విజయం సాధించారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మొదటి రౌండ్ ప్రక్రియలో భాగంగా 31వ వార్డు శివరాంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి దుర్గం మల్లికార్జున్ గౌడ్ ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై 150 ఓట్లతో గెలుపొందారు.

News February 13, 2026

వీడని AI భయాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. AI భయాలు ఐటీ రంగాన్ని వీడకపోవడం మొత్తం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. సెన్సెక్స్ 823 పాయింట్లు నష్టపోయి 82,851 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు కుంగి 25,541 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, ఎయిర్‌టెల్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫీ, TCS, HCL టెక్, టెక్ మహీంద్రా, ఎటర్నల్ భారీ నష్టాల్లో ఉన్నాయి.