News January 16, 2026

నిజామాబాద్ ఫస్ట్.. నల్గొండ సెకండ్

image

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 5.23 లక్షల టన్నులతో జిల్లా రెండో స్థానంలో ఉండగా, 6.93 లక్షల మెట్రిక్ ​టన్నుల ధాన్యాన్ని సేకరించి నిజామాబాద్‌ మొదటి స్థానంలో ఉంది. పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేసి రైతులకు వారంలోగా నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపలేదు.

Similar News

News February 3, 2026

బలహీన పోలింగ్ బూత్‌లపై TDP ప్రత్యేక దృష్టి

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఓట్లు బాగా తగ్గిన పోలింగ్ బూత్‌లపై TDP ప్రత్యేక దృష్టి సారించింది. ఇలాంటి బూత్‌లు 4500 ఉన్నట్లు గుర్తించి వాటిపై సర్వే చేయించింది. వివిధ పదవులు పొందిన 1000 మంది నాయకులతో ఈ సర్వే పూర్తి చేసింది. వీటిలో ఉన్న లోపాలపై నివేదికలను రప్పించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు SEC కసరత్తు చేపట్టిన నేపథ్యంలో అంతకు ముందుగా ఈ బూత్‌లలో పార్టీని పటిష్ఠం చేసేలా శిక్షణకు నిర్ణయించింది.

News February 3, 2026

నెల్లూరులో రాజమండ్రి గంజాయి స్మగ్లర్‌‌పై PD యాక్ట్

image

నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కేసుల్లో పలుమార్లు నిందితుడిగా ఉన్న రాజమండ్రికి చెందిన ప్రకాశ్‌పై PIT-NDPS చట్టం కింద PD యాక్ట్ అమలు చేసినట్లు ఎస్పీ అజిత వేజండ్ల తెలిపారు. ఇప్పటికే పలు NDPS కేసుల్లో నమోదై ఉన్నప్పటికీ డ్రగ్స్ కార్యకలాపాలు కొనసాగించడంతో ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ హెచ్చరించారు.

News February 3, 2026

VZM: వివిధ శాఖల పనితీరుపై జేసీ అసంతృప్తి

image

PGRSకు వచ్చే వినతులను రెండు పూటలా లాగిన్‌లో తనిఖీ చేసి, గడువు లోపే పరిష్కరించాలని JC సేధు మాధవన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ పిటిషన్‌లకు ఎమ్మార్వోలు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఐవీఆర్‌ఎస్‌లో కొన్ని శాఖలకు నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, అన్నా కాంటీన్లు, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, హెల్త్, ఇరిగేషన్ వంటి శాఖలు పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు.