News April 25, 2024
హైదరాబాదీలకు రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి

హైదరాబాద్ డెవలప్‌మెంట్ బాధ్యత కాంగ్రెస్ తీసుకొంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం రాజేంద్రనగర్‌లో MP అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి మూసీ నదిని సుందరీకరిస్తామని CM హామీ ఇచ్చారు. ఇక్కడి భూముల విలువను పెంచుతామన్నారు. ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ MP అభ్యర్థిని పార్లమెంట్‌కు పంపాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 12, 2025
HYD: మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్‌ఛార్జి బాధ్యుడు: రంగనాథ్

మ్యాన్ హోల్‌లో చిన్నారి పడిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. మ్యాన్‌హోల్ ఘటనపై ఉదయం ప్రాథమిక విచారణ జరిగిందని ఇందులో హైడ్రాదే పూర్తి బాధ్యత అన్నారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్‌ఛార్జి ఈ ఘటనకు బాధ్యుడని, మ్యాన్‌హోల్ మూత మూసేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకున్నామన్నారు. బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News September 12, 2025
సికింద్రాబాద్: గాంధీలో సేవలు ఇకనైనా గాడిన పడేనా?

గాంధీ ఆస్పత్రి అంటేనే తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు ఓ ధైర్యం.. అలాంటిది ఇటీవల ఇందులో సరైన సేవలందడం లేదని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనంతటికీ కారణం సూపరింటెండెంట్ డా.రాజకుమారి నిర్లక్ష్య వైఖరే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ప్రభుత్వం ఆమె స్థానంలో అడిషనల్ DME డా.వాణి నూతన సూపరింటెండెంట్‌ను నియమించింది. ఇప్పుడైనా సేవలు మెరుగుపడతాయేమోనని నగర వాసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
News September 12, 2025
KPHB: ఆత్మహత్యాయత్నం కేసులో గృహిణి రిమాండ్

KPHB 6వ ఫేజ్‌లో దంపతులు సూసైడ్ అటెంప్ట్ కేసు గత నెల 30న సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిలో భర్త రామకృష్ణారెడ్డి చనిపోగా భార్య రమ్యకృష్ణ చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. అప్పుల బాధ తాళలేక ఇద్దరు ఆత్మహత్యకు యత్నించడం, భర్తను కత్తితో గాయపరచగా రక్తస్రాపమై మృతి చెందాడు. భార్య చనిపోవడానికి ప్రయత్నించగా భయం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.