News January 16, 2026

టోల్ ప్లాజాల దగ్గర ఇక నో క్యాష్ పేమెంట్స్?

image

వంద శాతం డిజిటల్ టోలింగ్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. టోల్ ప్లాజాల దగ్గర క్యాష్ పేమెంట్స్‌ను పూర్తిగా నిలిపేసి కేవలం FASTag లేదా UPI ద్వారానే వసూలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చిల్లర సమస్యలు, ట్రాఫిక్ జామ్‌లకు స్వస్తి పలకడమే లక్ష్యంగా ఈ మార్పు తీసుకురానున్నారు. దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.

Similar News

News February 25, 2026

‘మంత్రం’ అంటే ఏమిటి? దాని మూలాలు..

image

‘మంత్రం’ అనే పదం సంస్కృత ధాతువు ‘మన్’(ఆలోచించడం) నుంచి పుట్టింది. అంటే మనసును రక్షించేదని అర్థం. ఇవి ప్రాచీన వేద కాలంలో రుషుల ద్వారా ఉద్భవించాయి. మంత్రం అంటే పదమే కాదు. పవిత్ర ధ్వని శక్తి. రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం వంటి గ్రంథాల నుంచి తీసుకున్నారు. మంత్రాలలో అర్థం కంటే కూడా ఆ శబ్దాల వల్ల కలిగే ప్రకంపనలే అత్యంత ముఖ్యమైనవి. ఇవి మనల్ని ఆధ్యాత్మికంగా, మానసిక స్థాయిలో ఉన్నత స్థితికి చేరుస్తాయి.

News February 25, 2026

IT స్టాక్స్ పతనం: ₹4.86 లక్షల కోట్లు హాంఫట్!

image

AI వల్ల IT రంగంలోని కంపెనీల షేర్ల విలువలు ఏకంగా 25% వరకు పడిపోయాయి. నిఫ్టీ IT ఇండెక్స్ ఈ నెలలో 21% నష్టపోగా, కోఫోర్జ్ 26%, LTI మైండ్‌ట్రీ 24% క్షీణించాయి. TCS, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజాలు కూడా 17-22% వరకు విలువను కోల్పోయాయి. మొత్తంగా IT రంగంలో దాదాపు ₹4.8 లక్షల కోట్ల మార్కెట్ విలువ ఆవిరైంది. AI వల్ల కోడింగ్ ఖర్చులు తగ్గి భారత IT కంపెనీల కాంట్రాక్టులు రద్దవుతాయన్న ఆందోళనలే దీనికి కారణం.

News February 25, 2026

‘UK బాకీ పడింది.. వడ్డీతో సహా చెల్లించాల్సిందే’.. ఇండియన్ పోరాటం!

image

మధ్యప్రదేశ్‌కు చెందిన 63ఏళ్ల వివేక్ రూఠియా తన తాత బ్రిటిష్ ప్రభుత్వానికి 1917లో ఇచ్చిన అప్పును తిరిగి వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ‘ఇండియన్ వార్ లోన్’ పేరుతో నిధులు సేకరించగా వివేక్ తాత సేఠ్ జుమ్మా లాల్ ₹35,000 రుణంగా ఇచ్చారు. వడ్డీతో కలిపి ప్రస్తుతం ఆ మొత్తం ₹2కోట్లు ఉంటుందని అంచనా. ఈ సొమ్మును రికవరీ చేసేందుకు యూకే ప్రభుత్వంపై దావా వేయనున్నారు.