News January 16, 2026

విశాఖలో భూ లిటిగేషన్‌లతో తలపోటు (2/2)

image

విశాఖలో భూ లిటిగేషన్లు ఎంతలా ఉన్నాయంటే.. ఇటీవల పెందుర్తి (M) చింతగట్లలో ప్రభుత్వ భూమి ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై రాళ్లదాడికి తెగబడ్డారు. అదేవిధంగా గండిగుండంలో భూ వివాదం చెలరేగింది. VMRDA చేపడుతున్న అడవివరం–సొంట్యం రహదారి విస్తరణతో ల్యాండ్ విలువ రూ.కోట్లు పలుకుతోంది. ఈ నేపథ్యంలో అక్రమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నా.. లిటిగేషన్ బ్యాచ్‌ల ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Similar News

News February 14, 2026

విశాఖ: బిల్డింగ్ పైనుంచి పడి యువకుడి మృతి

image

విశాఖలోని సాగర్ నగర్‌లో బిల్డింగ్ పరంజి విరిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వాంబేకాలనీకి చెందిన కోలా రాజు(30) డ్రైవింగ్, విద్యుత్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఓ బిల్డింగ్‌లో విద్యుత్ పని చేస్తుండగా పరంజి విరిగిపోవటంతో 4 అంతస్థుల పైనుంచి పడి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.

News February 14, 2026

ఏలేశ్వరం కొండను చూసేద్దాం ఛలో ఛలో!

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జలాశయం మధ్యలో ఉన్న ఏలేశ్వరం కొండకు తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీలు నడపనున్నట్లు పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. పెద్దలకు రూ.250, పిల్లలకు (4 నుంచి 12 సంవత్సరాల వరకు) రూ.200లుగా టికెట్ ధరలు నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే ఏలేశ్వరం కొండకు లాంచీలు నడపనున్నట్లు తెలిపారు.

News February 14, 2026

నిజాయతీకి నిలువుటద్దం!

image

నేడు దామోదరం సంజీవయ్య 105వ జయంతి. కర్నూలు జిల్లా పెద్దపాడులో జన్మించిన ఆయన అతి పిన్న వయసులో (38 ఏళ్లు) ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. తొలి దళిత సీఎంగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆయన సేవలు చిరస్మరణీయం. ఏసీబీ వ్యవస్థ స్థాపన, భూ పంపిణీ వంటి విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి అందరికీ అజాతశత్రువుగా పేరొందారు. పదవులు అనుభవించినా సొంత ఇల్లు కూడా లేని ఆయన నిరాడంబరత నేటి తరానికి స్ఫూర్తిదాయకం.