News January 16, 2026

ADB రిమ్స్‌లో పోస్టులకు దరఖాస్తులు

image

ADB రిమ్స్ వైద్య కళాశాలలో వివిధ విభాగంలో డాక్టర్ పోస్టులను గౌరవ వేతనంతో పాటు కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. అర్హులైన ట్యూటర్స్, సీఎంఓ, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సీనియర్ రెసిడెంట్స్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వివరాలకు rimsadilabad.org, adilabad.telangana.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలన్నారు. ఈ నెల 23న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.

Similar News

News February 2, 2026

ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ..!

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ నెలకొంది. ఇటీవల BRS నుంచి అధికార కాంగ్రెస్‌లో చేరిన పలువురు తాజా మాజీ కౌన్సిలర్లకు నిరాశే మిగిలినట్లు సమాచారం. వీరిలో కొంతమంది అభ్యర్థులకు B ఫామ్ వస్తుందా రాదా అన్న సందిగ్ధత నెలకొంది. టికెట్ విషయంలో తమకు అన్యాయం జరిగిందని, ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటున్నామని వాట్సాప్ స్టేటస్‌లో నేతలు ఆవేదన వెళ్లగక్కడం చర్చనీయాంశంగా మారింది.

News February 2, 2026

ADB: పదో తరగతి విద్యార్థులకు లక్షల్లో బహుమతులు

image

ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ‘మిషన్ 10th క్లాస్’ పేరుతో బహుమతులు ప్రకటించింది. రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధిస్తే రూ.5లక్షలు, రెండో ర్యాంకుకు రూ.3లక్షలు అందజేయనున్నట్లు వెల్లడించింది. ప్రతి జిల్లా టాపర్‌కు రూ.2లక్షలు, నియోజకవర్గ టాపర్‌కు రూ. లక్ష చొప్పున బహుమతులు అందనున్నాయి. ఎమ్మెల్యేకు సంస్థ ప్రతినిధులు వివరించగా హర్షం వ్యక్తం చేశారు.

News February 1, 2026

చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన ADB కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులను అధికారులు అత్యంత అప్రమత్తంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షి షా ఆదేశించారు. ఆదివారం రాత్రి బట్టిసావర్గం చెక్‌పోస్ట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా చెక్‌పోస్టుల పనితీరు కీలకమన్నారు. ఎలాంటి అలసత్వానికి తావులేకుండా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.