News January 16, 2026

14 వేల పోలీసు ఉద్యోగాలు.. BIG UPDATE

image

TG: రాష్ట్రంలో 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17 వేల మంది కానిస్టేబుల్, ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారని అధికారులు నివేదిక ఇచ్చారు. వీరిలో దాదాపు 1100 మంది ఎస్సై, సీఐ, ఇతర సిబ్బంది ఉన్నారు. మొత్తంగా గ్రేటర్ పరిధిలోనే 6 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు 14 వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం, ఆర్థికశాఖకు హోంశాఖ ఫైల్ పంపింది. ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది.

Similar News

News February 17, 2026

పిల్లల్లో మూర్ఛ ఉంటే ఏం చేయాలంటే?

image

మూర్ఛ వ్యాధి విషయంలో చాలా మంది అలర్ట్​గా ఉండట్లేదని నిపుణులు అంటున్నారు. పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లల్లో వచ్చే సీజర్స్‌కు కారణాలూ, చికిత్సకు వారు స్పందించే తీరుతెన్నులూ ఇవన్నీ కాస్త వేరుగా ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. చికిత్సను మధ్యలోనే ఆపేయకుండా చివరి వరకు కొనసాగించాలని సూచిస్తున్నారు. అప్పుడే 80-90 శాతం మూర్ఛ రోగులలో ఈ వ్యాధి కంట్రోల్‌ అవుతుందని చెబుతున్నారు.

News February 17, 2026

పిల్లలకు జ్వరంతో పాటు ఫిట్స్ వస్తుంటే..

image

ఆరు నెలల నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలో జ్వరంతో పాటు కొందరికి ఫిట్స్​ వస్తుంది. రోజులో రెండు, మూడు సార్లు వస్తే మాత్రం సీరియస్​గా తీసుకోవాలి. తల్లిదండ్రులకు చిన్నప్పుడు ఫిట్స్​ ఉంటే అదీ పిల్లలకు వంశపారపర్యంగా వస్తుంది. జ్వరంతోపాటు తలనొప్పి, వాంతులు, చురుకుగా ఉండకపోవడం, బీపీ తగ్గిన సమయంలో ఫిట్స్​ వస్తే మాత్రం సీరియస్​గా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మెదడువాపు వ్యాధి లక్షణాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

News February 17, 2026

T20 WC: ఆస్ట్రేలియాకు ఏమైంది?

image

‘కప్పు ముఖ్యం బిగిలు’ అంటూ ICC టోర్నీల్లో అదరగొట్టే ఆస్ట్రేలియా ఈసారి T20 WCలో గ్రూప్ స్టేజ్ దాటే పరిస్థితి కనిపించట్లేదు. దీనికి ప్రధాన కారణం వారి బౌలింగే. హేజిల్‌వుడ్, కమిన్స్, స్టార్క్ లేకపోవడంతో బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. ప్రధాన స్పిన్నర్ జంపా ZIM, SLతో మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. గాయాల బెడద, బ్యాటింగ్‌లో నిలకడలేమి, చివరి ఓవర్లలో తడబాటు ఆ జట్టుకు ఇబ్బందిగా మారాయి.