News January 16, 2026
స్టీల్ ప్లాంట్: కాలువలో ఉద్యోగి అనుమానాస్పద మృతి

స్టీల్ ప్లాంట్‌లోని కోపరేటివ్ స్టోర్స్‌లో అసిస్టెంట్‌గా పని చేస్తున్న సతీశ్ డీఏవీ పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న కాలువలో శవమై కనిపించడం కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం కాలువలో మృతదేహం ఉన్నట్లు స్టీల్ ప్లాంట్ పోలీసులకు సమాచారం అందడంంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 23, 2026
పెరటి కోళ్ల పెంపకం.. ఈ జాతులతో అధిక ఆదాయం

కోళ్ల పెంపకం నేడు ఉపాధి మార్గంగా మారింది. మేలైన జాతి రకాలతో మంచి ఆదాయం సాధించవచ్చు. పెరటి కోళ్ల పెంపకానికి స్వర్ణధార, గ్రామ ప్రియ, శ్రీనిధి రకాలతో మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇవి అధిక మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెంది, ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఈ కోళ్ల జాతులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.
News January 23, 2026
భాగ్యనగరానికి మరో ‘అమృత్ భారత్’.. రూట్ మ్యాప్ ఇదే!

TG: చర్లపల్లి – తిరువనంతపురం మధ్య కొత్త అమృత్ భారత్ 2.0 ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. PM మోదీ శుక్రవారం దీన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ఉదయం 7.15కి చర్లపల్లిలో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం కేరళ చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. అమృత్ భారత్‌లో RAC టికెట్లు ఉండవు.
News January 23, 2026
VZM: అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా గురుకుల పాఠశాల సమన్వయ అధికారిణి ఎం.మాణిక్యం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 19లోపు http://apbrgcet.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మార్చి 1,2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు.


