News January 16, 2026

ఎల్ఐసీ బిల్డింగ్ సమీపంలో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

ఆర్టీసీ కాంప్లెక్స్, ఎల్ఐసీ బిల్డింగ్ మధ్యలో ఉన్న బస్టాప్ వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు 75 సంవత్సరాలు దాటి ఉంటుందని ట్రాఫిక్ ఎస్ఐ సింహాచలం తెలిపారు. వైట్ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని.. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 11, 2026

రేపు సమ్మె.. విశాఖ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి

image

చెత్తాచెదారం బహిరంగ ప్రదేశాల్లో 12వ తేదీన వెయ్యవద్దని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఓ ప్రకటనలో కోరారు. దేశవ్యాప్త కార్మికుల సమ్మె 12వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు గురువారం తగ్గే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు చెత్తచెదారం బహిరంగ ప్రదర్శనలో వేయడం మానేసి 13వ తేదీన మీ ఇంటికి వచ్చే క్లాప్ వాహనాలకు పారిశుధ్య సిబ్బందికి అందించాలని విడుదల చేసిన ప్రకటనలో కమిషనర్ పేర్కొన్నారు.

News February 11, 2026

దేశ ఇంధన భద్రతలో కీలక కేంద్రంగా విశాఖ

image

విశాఖ దేశ ఇంధన భద్రతకు కీలక వ్యూహాత్మక కేంద్రంగా ఎదిగింది. భారత్ పెట్రోలియం నిల్వలను విశాఖ, మంగళూరు, పడూర్ ప్రాంతాల్లో భూగర్భ గుహల్లో ఏర్పాటు చేసింది. ఈ నిల్వలు రిఫైనరీల స్టాక్‌తో కలిపి దేశ అవసరాలను 74 రోజులు తీర్చగలవని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంట్‌లో చెప్పారు. తూర్పు తీరంలో విశాఖ నిల్వ సదుపాయం ఇంధన సరఫరా స్థిరత్వానికి బలోపేతం చేస్తూ జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది.

News February 11, 2026

మిలాన్ వేడుకల నేపథ్యంలో విశాఖ అంతటా నిఘా

image

మిలాన్, ఐ.ఎఫ్.ఆర్ వేడుకల నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అన్ని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అంతర్జాతీయ ప్రతినిధుల రాక దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరాన్ని హై అలర్ట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.