News January 16, 2026
రొమాన్స్‌కు నో చెప్తే ఒత్తిడి చేశారు: తమన్నా

కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులు పడినట్లు హీరోయిన్ తమన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సీనియర్ స్టార్లతో రొమాన్స్(ఇంటిమేట్) చేయాలని దర్శకుడు కోరితే కంఫర్ట్ లేకపోవడంతో నో చెప్పా. ఆ సమయంలో హీరోయిన్‌ను మార్చాలని అరుస్తూ దర్శకుడు నాపై ఒత్తిడి చేయాలని చూశారు. అయినా వెనక్కి తగ్గొద్దని నిర్ణయించుకున్నా. చివరకు దర్శకుడే సారీ చెప్పారు’ అని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో సురక్షితమైన వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు.
Similar News
News February 10, 2026
ఈనెల 20 వరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు: అదనపు కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతులందరూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. 2025–26 సీజన్‌కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వారా జిల్లాలో పత్తి కొనుగోళ్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ఈనెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News February 10, 2026
రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉపవాసాల నేపథ్యంలో ఒక గంట ముందే ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. ఈనెల 18 నుంచి మార్చి 19 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులు డ్యూటీ నుంచి ఒక గంట ముందే ఇంటికి వెళ్లొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 10, 2026
మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

భార్యాభర్తల జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం అడ్డం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. భాగస్వామితో నేరుగానే మాట్లాడి పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.


