News January 16, 2026

₹లక్ష పెట్టుబడికి ₹4 లక్షల రిటర్న్స్!

image

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండుతోంది. 2019 జులై (సిరీస్-II)లో ₹లక్ష పెట్టిన వారికి నేడు వాటి విలువ ఏకంగా ₹4.15 లక్షలకు చేరింది. RBI ప్రకటించిన తాజా రిడెంప్షన్ ధర ప్రకారం.. గ్రాము బంగారం విలువ ₹14,092గా ఉంది. అంటే ఐదేళ్ల క్రితం ₹3,393కే కొన్న బాండ్లపై ఏకంగా 315% లాభం వచ్చింది. దీనికి అదనంగా ఏటా వచ్చే 2.5% వడ్డీ బోనస్! మీ దగ్గర SGBలున్నాయా? Comment

Similar News

News February 20, 2026

నేడు అల్పపీడనం.. వర్ష సూచన

image

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, భూమధ్య రేఖకు ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి దక్షిణ తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాయలసీమలోనూ వానలు పడతాయని హెచ్చరించింది. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో 22వ తేదీ నుంచి వర్షాలకు ఆస్కారం ఉందని అంచనా వేసింది.

News February 20, 2026

యూరియా, వేపపిండిని కలిపి వాడటం వల్ల లాభాలు

image

సాధారణంగా పంటకు వేసిన యూరియా త్వరగా ఆవిరికావడం, నీళ్లలో కొట్టుకుపోవడం జరుగుతుంది. దీన్ని వేపపిండితో కలిపి వాడితే యూరియాలో నత్రజని నెమ్మదిగా కరిగి మొక్కలకు స్థిరంగా, ఎక్కువ కాలం పాటు అందుతుంది. దీని వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. నత్రజని వృథా 20-30% తగ్గుతుంది. నేల ఆరోగ్యం పెరిగి, వేరుకుళ్లు, నులి పురుగుల సమస్య తగ్గుతుంది. 50 కేజీల యూరియాకు నిపుణుల సూచనలతో 5KGల వేపపిండి కలపడం మంచిది.

News February 20, 2026

ఏఐ సమ్మిట్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

image

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో తెలుగు రాష్ట్రాల CMలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో CBN భేటీ కానున్నారు. ఉదయం ప్లీనరీ సెషన్‌లో, మధ్యాహ్నం WEF నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మరోవైపు తెలంగాణ ఏఐ పాలసీపై CM రేవంత్ ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌లో ఏఐ అభివృద్ధికి చేస్తున్న కృషి, ప్రోత్సాహం, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులపై మాట్లాడనున్నారు.