News January 17, 2026

ట్రంప్ ఆంక్షలు.. చాబహార్‌ పోర్టుపై భారత్ స్పందన ఇదే

image

ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్‌లు వేస్తానని ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టు ప్రాజెక్టు నుంచి భారత్‌ తప్పుకుంటుందనే వార్తలపై విదేశాంగశాఖ స్పందించింది. US ఇచ్చిన మినహాయింపులు ఏప్రిల్‌ వరకు ఉన్నాయని, ఈ అంశంపై సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది. మధ్య ఆసియాతో వాణిజ్యానికి ఈ పోర్టు కీలకం కానుంది.

Similar News

News February 21, 2026

ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 3 రీసెర్చ్ అసోసియేట్, SRF పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగాన్ని బట్టి PhD, MTech(లైఫ్ సైన్సెస్), PG(జెనెటిక్స్/ప్లాంట్ బ్రీడింగ్/బయోటెక్నాలజీ/ లైఫ్ సైన్సెస్), NET, GATE అర్హతతో పాటు పనిఅనుభవం గలవారు మార్చి 12వరకు దరఖాస్తును ఈ మెయిల్ చేయాలి. RAకు గరిష్ఠ వయసు 40ఏళ్లు. SRFకు 35ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.iari.res.in/

News February 21, 2026

కుందేళ్ల షెడ్డు నిర్మిస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి

image

కుందేళ్ల షెడ్‌ను ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. గాలి ఎక్కువగా తగిలేలా చూసుకోవాలి. షెడ్‌ను తూర్పు, పడమర దిశలో కట్టాలి. షెడ్‌ పరిసరాల్లో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి. శబ్దాల వల్ల కుందేళ్లు భయపడి వాటి ఉత్పాదక సామర్థ్యం తగ్గే ఛాన్సుంది. షెడ్డు లోపల చల్లని వాతావరణం ఉండాలి. షెడ్డు ఉష్ణోగ్రత ఎండాకాలంలో 30 డిగ్రీల సెల్సియస్ దాటకుండా.. చలికాలంలో 20 డిగ్రీల సెల్సియస్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

News February 21, 2026

గురువారం ‘తిరుప్పావడ సేవ’

image

గురువారం స్వామివారికి అన్ని ఆభరణాలు తొలగించి ధోవతి, ఉత్తరీయాలే ఉంచుతారు. ఈరోజు స్వామివారిని నిజరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి నామ పరిమాణాన్ని తగ్గించడం వల్ల ఆ దివ్య నేత్రాలను నేరుగా చూడవచ్చు. దీన్నే నేత్ర దర్శనం అంటారు. బంగారు తొట్టిలో భారీగా పులిహోర నివేదిస్తారు. నామం తీసినప్పుడు స్వామివారి శక్తిమంతమైన చూపు నేరుగా భక్తులపై పడకుండా దీనిపై పడేలా చేస్తారు. అందుకే దీనికి పావడ అని పేరొచ్చింది.