News January 17, 2026

NRPT: మున్సిపల్ తుది ఓటర్ల జాబితా విడుదల

image

నారాయణపేట పురపాలక సంఘ పరిధిలో జరగనున్న రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలు నేపథ్యంలో తుది ఫొటో ఓటర్ల జాబితా, తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైదరాబాద్ ఆదేశాల మేరకు శుక్రవారం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు గాను మొత్తం 56 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఈ జాబితాలను ప్రజల పరిశీలనార్థం ప్రచురించారు.

Similar News

News February 19, 2026

NTR: BREAKING.. ACBకి చిక్కకుండా SI ఎస్కేప్!

image

పోక్సో కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసిన NTR జిల్లా వత్సవాయి SI ఉమామహేశ్వరరావు ACB దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. మంగళవారం బాధితుడు డబ్బుతో స్టేషన్‌కు రాగా, బయట కొత్త వ్యక్తులను గమనించిన కానిస్టేబుల్ SIని అప్రమత్తం చేశారు. దీంతో SI అక్కడి నుంచి హుటాహుటిన పరారయ్యారు. పక్కా ప్లాన్‌తో వచ్చిన ACB అధికారులు, SI చాకచక్యంగా తప్పించుకోవడంతో ఖంగుతిన్నారు.

News February 19, 2026

రూ.50Kకే మ్యాక్‌బుక్ ఎయిర్?

image

మార్చ్ 4న జరిగే కంపెనీ ఈవెంట్‌లో లోకాస్ట్ మ్యాక్‌బుక్‌ను యాపిల్ లాంఛ్ చేయనుందని సమాచారం. ప్రస్తుతం మ్యాక్ బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లలో ఎయిర్ వర్షన్ తక్కువ ధర. అయితే అది కూడా రూ.1లక్షకు సమీపంలో ఉండగా, వచ్చే నెలలో రిలీజ్ అయ్యే డివైజ్ ధర రూ.50వేలు ఉండొచ్చని టెక్ లీక్స్ చెబుతున్నాయి. ఇందులో A18 చిప్, ai సహా పలు ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఇక ఇదే ఈవెంట్‌లో 17e మొబైల్‌నూ యాపిల్ రిలీజ్ చేయనుంది.

News February 19, 2026

అనంతపురంలో మహిళ హత్య.. ఆరుగురు అరెస్ట్

image

అనంతపురం కొవ్వూరు నగర్‌లో జరిగిన గౌసియా బేగమ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు నిందితులు అరెస్ట్ చేసినట్లు CI రాజేంద్రనాథ్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. బేగమ్ కుమారుడు ఇమ్రాన్ ఖాన్ తన భార్యతో సన్నిహితంగా ఉన్నాడనే అనుమానంతో మల్కి జాఫర్ అతడిపై దాడికి దిగారు. అడ్డుగా వచ్చిన బేగమ్ గాయపడి మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను చేయగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు జాఫర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.