News January 17, 2026
KMR, NZB జిల్లాలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే?

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని వివిధ మార్కెట్లలో కూరగాయల ధరల వివరాలు ఇలా ఉన్నాయి.(కేజీలలో): టమాట-రూ.30/-, వంకాయలు-50/-, బెండకాయలు-80/-, పచ్చిమిర్చి-60/-, కాకరకాయలు-60/-, బీరకాయలు-80/-, చిక్కుడుకాయ -80/-,దోసకాయలు-50/-, ఆలుగడ్డ-40/-, ఉల్లిగడ్డలు-50/-, క్యాబేజి-50/-, క్యారెట్-50/-, కాలిఫ్లవర్-60/- క్యాప్సికం-50/-, దొండకాయలు-60/-, పాలకూర-60/-, తోటకూర-రూ.60/- ధరలు పలుకుతున్నాయి.
Similar News
News January 30, 2026
కాకినాడ: బాలికపై వేధింపుల కేసు.. యువకుడు ఆత్మహత్య

పిఠాపురం పట్టణానికి చెందిన గిసాల సతీశ్(28) గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఓ బాలికను వేధిస్తున్నాడన్న ఫిర్యాదుపై పోలీసులు బుధవారం సతీశ్‌ను విచారణకు పిలిపించారు. అయితే, స్టేషన్‌కు వచ్చే ముందే సతీశ్ పురుగుల మందు తాగిన <<18989382>>విషయం తెలిసిందే<<>>. వెంటనే కాకినాడ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. వేధింపుల కేసు విచారణ వేళ ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News January 30, 2026
అభ్యర్థులను ఖరారు చేయని రాజకీయ పక్షాలు

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులను రాజకీయ పార్టీలు ఖరారు చేసే పనిలో పడ్డాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉండనుండగా ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇరు పార్టీలు అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ రకాలుగా సర్వేలు నిర్వహించాయి. ప్రధానంగా సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయకపోవడంతో ‘భీ’ ఫారాలు అందజేయలేదు.
News January 30, 2026
భార్యాభర్తలకు గ్రూప్-2 ఉద్యోగాలు

బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామానికి చెందిన దంపతులు బాణా విజయచంద్రా రెడ్డి, శరణ్య గ్రూప్-2 ఫలితాల్లో విజయం సాధించారు. సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వీరు కష్టపడి తమ కలలను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న శరణ్య ఏఎస్ఓ (ASO)గా ఎంపిక కాగా, భర్త విజయచంద్రా రెడ్డి సైతం అదే ఉద్యోగం సాధించారు. వీరిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.


