News January 17, 2026
కోనసీమ: కొత్తలంకలో అర్థరాత్రి కారు బీభత్సం

ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో యువకులు సృష్టించిన బీభత్సం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. వేగంగా వచ్చిన కారు విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో స్తంభం విరిగి ముక్కలైంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, అందులోని ఇద్దరు యువకులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Similar News
News February 17, 2026
‘రామాయణ’ కోసం రెహమాన్ డిజిటల్ డిటాక్స్

నితేశ్ తివారీ ‘రామాయణ’ సినిమాకు జిమ్మర్‌తో కలిసి రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. మూవీ యూనిట్‌ను పరిచయం చేయడానికి మార్చిలో ఓ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు. దీనిపై ఫోకస్ చేయడానికి రెహమాన్ 40 రోజులు డిజిటల్ డిటాక్స్ పాటించనున్నట్లు ప్రకటించారు. ‘జిమ్మర్, నేను కలిసి ఓ ఐకానిక్ మ్యూజిక్ చేస్తున్నాం. అణువణువు రామాయణం, సంస్కృతిని నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు.
News February 17, 2026
పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్

డిజిటల్ ఇండియాను ప్రమోట్ చేసేందుకు కేంద్రం నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్‌లో యూపీఐకి ఆప్షన్ లేకపోవడం చర్చనీయాంశమైంది. అక్కడి ఫుడ్ స్టాల్స్.. ‘నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్’ అంటున్నాయి. UPI ఉంటుందిలే అనే ధీమాతో అక్కడికి వచ్చిన వారు చెల్లింపులకు ఇబ్బంది పడ్డారు. ఒకపక్క నో క్యాష్.. నో కార్డ్.. ఓన్లీ యూపీఐ అని ప్రమోట్ చేస్తుంటే ఇక్కడ సీన్ రివర్స్‌లో ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.
News February 17, 2026
మద్దిమడుగు పర్యటనలో సీఎంవో సెక్రెటరీ.. కలెక్టర్ స్వాగతం

మద్దిమడుగు క్షేత్రంలో సంతు సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారవుతున్న తరుణంలో సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాస్ రాజ్ మంగళవారం సందర్శించారు. జిల్లా కలెక్టర్ సంతోష్ ఆయనకు స్వాగతం పలికి ఏర్పాట్లను వివరించారు. CM రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకుని భద్రత, ప్రోటోకాల్ అంశాలను సెక్రెటరీ పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.


