News January 17, 2026

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందంటే..?

image

HYDలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ బాలాపూర్‌లో శనివారం తెల్లవారుజామున 254కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత వారంలో కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత.. మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది.

Similar News

News February 2, 2026

HYD: GHMCని ఎవరూ పట్టించుకోవడం లేదు బాస్..?

image

GHMC పునర్విభజన ప్రక్రియ పూర్తయింది.. 300 డివిజన్లుగా మహానగరం రూపుదిద్దుకుంది. కానీ పనులు మాత్రం కావడం లేదు. వివిధ సమస్యల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా విద్యుత్, ఎంటమాలజీ, పశుసంవర్ధక, పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించి సిబ్బంది నియామకం పూర్తిస్థాయిలో కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరిని అడగాలి? అని వాపోతున్నారు.

News February 2, 2026

HYDలో మళ్లీ పెరిగిన ఎయిర్ పొల్యూషన్ @318

image

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ సోమవారం తెల్లవారుజామున సోమాజిగూడలోని టీచర్స్ కాలనీలో 318గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News February 2, 2026

HYD: భార్య ఆత్మహత్య బెదిరింపు.. స్టూల్‌ తన్నేసిన భర్త!

image

క్షణికావేశం, మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫిలింనగర్‌కు చెందిన కొండల్ శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్య అరుణతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తనను బెదిరించేందుకు అరుణ స్టూల్‌పై ఎక్కి ఉరి వేసుకోబోగా, ఆగ్రహంతో ఉన్న కొండల్ స్టూల్‌ను కాలితో తన్నేశాడు. దీంతో ఆమె ఊపిరాడక ప్రాణాలు విడిచింది. కుమారుడు ఇచ్చిన సాక్ష్యంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.