News January 17, 2026
బీఆర్‌ఎస్ MLAలు, MLCలతో నేడు KTR కీలక భేటీ

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ నేడు కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్టీ సీనియర్ నేతలతో ఆయన బ్రేక్‌ఫాస్ట్ సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ చేపట్టేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది.
Similar News
News February 19, 2026
HYDలో అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్..!

FEB 20,21,22 తేదీల్లో 3రోజులు HYDలో అగ్రి షో పేరుతో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ తెలిపారు. NTR స్టేడియంలో ఈ ప్రోగ్రాం ఉంటుందని.. 3రోజుల్లో లక్షమంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. దేశ, విదేశాల నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500కుపైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. www.rbagrishow.com.
News February 19, 2026
HYDకు ‘ప్యాకేజింగ్’ మకుటం.. 64 ఏళ్లలో ఇదే తొలిసారి..!

భాగ్యనగర కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరింది. 64 ఏళ్ల చరిత్ర కలిగిన ICCA గ్లోబల్ సమ్మిట్ 2027కు ఆతిథ్యమిచ్చే అరుదైన అవకాశం మన HYDకు దక్కింది. హైటెక్స్‌లో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఈ విషయాన్ని గర్వంగా ప్రకటించారు. 95 శాతం రీసైకిల్ అయ్యే ఈ పర్యావరణ హిత ప్యాకేజింగ్ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇదో ప్యాకేజింగ్ విప్లవం!
News February 19, 2026
సర్కార్‌కు షాక్.. GHMC 3 ముక్కలాటపై హైకోర్టు సీరియస్..!

HYDను 3ముక్కలు చేస్తూ సర్కార్ తెచ్చిన GOపై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్రం ఫ్రీజ్ విధించినా రూల్స్‌కు విరుద్ధంగా GHMC విభజన నిర్ణయం తీసుకున్నారని గురువారెడ్డి పిల్ వేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ 3వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో విభజన ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి.


