News January 17, 2026
ఆసిఫాబాద్: పెళ్లయిన రెండు నెలలకే యువకుడి మృతి

సంక్రాంతి ఆ ఇంట్లో తీరని శోకాన్ని నింపింది. గురువారం సంగారెడ్డి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ASF జిల్లా కెరమెరి వాసి సంతోశం(32) మృతి చెందాడు. ఏడుపాయల దర్శనం ముగించుకుని వస్తుండగా, గేదెను తప్పించబోయి కారు చెట్టును ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. నవంబర్‌లో రెబ్బెనకు చెందిన శ్రావణితో వివాహమైంది. దీంతో తల్లిదండ్రులు, భార్య శ్రావణి కన్నీరుమున్నీరవుతున్నారు. స్నేహితులకు స్వల్ప గాయాలయ్యాయి.
Similar News
News February 20, 2026
VZM: మద్యానికి బానిసైన వ్యక్తి అత్మహత్య

మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరంలో జరిగింది. 1టౌన్ ఎస్ఐ ఎస్సై అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన బెవర శ్రీనివాస్(28) కూలీ పనులు చేస్తు జీవనం సాగించేవాడు. మద్యానికి బానిస కావడంతో ఆయన భార్య రేవతి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై శ్రీనివాస్ గురువారం ఇంట్లో ఉరేసుకొన్నాడు. మృతుడుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 20, 2026
సిద్ధిపేటలో నేడే మెగా సెమినార్.. పేరెంట్స్ మీకోసమే!

పదో తర్వాత విద్యార్థులు ఎలాంటి మార్గం వైపు వెళ్తే మంచి భవిష్యత్ ఉంటుందనే దానిపై తల్లిదండ్రులు స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత కెరీర్ గైడెన్స్ సెమినార్లు నిర్వహిస్తున్నాయి. సిద్ధిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఇవాళ సాయంత్రం.6 గంటలకు సదస్సు జరగనుంది. CBI Ex జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. సో పేరెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
News February 20, 2026
నేను సంపాదిస్తాను.. నువ్వు క్రికెట్ ఆడు: వరుణ్ చక్రవర్తి లవ్ స్టోరీ

టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సక్సెస్ వెనక భార్య నేహా ఖేడేకర్ త్యాగం మరువలేనిది. వీరిద్దరి లవ్‌స్టోరీ SRM వర్సిటీలో మొదలైంది. ఆర్కిటెక్ట్ జాబ్ వదిలేసి క్రికెట్ వైపు వెళ్లాలని వరుణ్ అనుకున్నప్పుడు నేహ కొండంత అండగా నిలిచారు. ‘నీకు జాబ్ లేకపోయినా ఫర్వాలేదు. నేను సంపాదిస్తాను. నువ్వు క్రికెట్ ఆడు’ అని ధైర్యమిచ్చారు. భవిష్యత్తుపై భరోసా లేక తనను వివాహం చేసుకోవద్దని వరుణ్ చెప్పినా ఆమె వినలేదట.


