News January 17, 2026
నిజామాబాద్‌లో సైబర్ మోసం

NZB పూసలగల్లి వాసి ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1.10 లక్షల మోసానికి గురయ్యాడు. లాభాలు గడించే సూచనలు చేసేందుకు రూ.3 వేలు చెల్లించి తమ గ్రూపులో చేరాలని మెస్సేజ్ వచ్చింది. డబ్బులు చెల్లించగా సైబర్ నేరగాళ్లు అతడి ఫోన్‌కు ఒక QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే మెళుకువలు తెలుస్తాయన్నారు. అది స్కాన్ చేయగానే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News January 25, 2026
NZB: కానిస్టేబుల్ సౌమ్య చికిత్సకు రూ.10 లక్షలు మంజూరు

విధి నిర్వహణలో గంజాయి ముఠా కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సౌమ్యకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు.
News January 25, 2026
జాతీయ ‘శిక్షా రత్న’ అవార్డులకు జిల్లా నుంచి ముగ్గురు

జాతీయ శిక్షా రత్న అవార్డుల్లో NZB జిల్లా ఉపాధ్యాయులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 150 మంది ఎంపికవగా మన జిల్లా నుంచి డా. ఈ. పోచన్న (పెర్కిట్), పి. రాజేశ్వర్ (ముప్కాల్), పి. శ్రావణ్ కుమార్ (నవీపేట) ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. టీఎల్ఎం ద్వారా సులభంగా బోధిస్తూ విద్యావ్యవస్థలో వారు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు, అధికారులు వారికి అభినందనలు తెలిపారు.
News January 25, 2026
అబద్ధాలను ఓడిద్దాం.. అభివృద్ధిని గెలిపిద్దాం: కాంగ్రెస్

నిజామాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మతపరమైన చిచ్చు పెట్టేవారి మాటలు నమ్మవద్దని, కేవలం అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని సూచించారు. “అబద్ధాలను ఓడిద్దాం – అభివృద్ధిని గెలిపిద్దాం” అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు.


