News January 17, 2026
ఉమ్మడి వరంగల్‌లో 260 వార్డులకు రిజర్వేషన్లు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 మున్సిపాలిటీలలోని 260 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 260 వార్డుల్లో 21 వార్డులు ఎస్టీల జనరల్‌కు, ఎస్టీ(మ) 15, ఎస్సీ(జ) 26, ఎస్సీ(మ) 18, బీసీ(మ) 29, బీసీ(జ) 21, జనరల్ 75, జనరల్ మహిళకు 56 వార్డులను రిజర్వ్ చేశారు. మున్సిపాలిటీలతో పాటుగా గ్రేటర్ వరంగల్ డివిజన్లకు రిజర్వేషన్లు చేశారు.
Similar News
News January 25, 2026
BNGR: తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

దిలావర్‌పూర్‌లో ఉదయం విషాదం నెలకొంది. గీత వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి పండరి గౌడ్ (53) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. పండరి గౌడ్ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని మోకుదెబ్బ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.
News January 25, 2026
కడప: పేరుకే రోడ్డు భద్రత వారోత్సవాలు.. చర్యలు ఎక్కడ?

ఇటీవల రోడ్డు భద్రతా వారోత్సవాలంటూ పోలీసులు, రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయితే వాటి అమలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇవాళ బద్వేల్‌లో మైనర్ బాలుడు బైక్‌పై వెళ్తూ <<189507>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దంటూ ప్రచారాలు చేస్తున్నా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం సరికాదని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు వీటిపై నిఘా పెడతారో లేదో చూడాలి.
News January 25, 2026
అల్లూరిలో చికెన్ ధరలు ఇలా

అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఆదివారం బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 300-360లగా విక్రయిస్తున్నారు. రాజవొమ్మంగి, చింతపల్లి, పాడేరు, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు తదితర ప్రాంతాల్లో ఈ రేటుకు విక్రయిస్తున్నట్లు వినియోగదారులు తెలిపారు. మేక మాంసం రూ. 800, చేపలు రూ.200-250వరకు విక్రయిస్తున్నారు.


