News January 17, 2026

హైదరాబాద్‌కు ‘ఊపిరి’.. పెరిగిన గాలి నాణ్యత

image

కాలుష్యానికి కేరాఫ్‌గా మారిన హైదరాబాద్‌కు కొంత ఉపశమనం లభించింది. సంక్రాంతి పండుగ సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో గాలి నాణ్యత కొంతమేర పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 50 కంటే తక్కువగా నమోదయింది. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వాహనాల అనవసర వాడకం తగ్గితే మంచి ఫలితం ఉంటుంది. అయితే సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగివస్తే మళ్లీ అదే తంతు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News February 19, 2026

వికారాబాద్‌ కొండలపై ఏపీ DCCలకు ట్రైనింగ్

image

హైదరాబాద్ శివారు ప్రాంతమైన అనంతగిరి గుట్టపై ఏపీకి చెందిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ టి.కాంగ్రెస్‌కు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణతోపాటు ఏపీ డీసీసీ అధ్యక్షుడు ఈ నెల 21 నుంచి జరిగే శిక్షణలో పాల్గొంటారు. ఏపీ నుంచి 41 మంది, తెలంగాణ నుంచి 36 మంది ఈ ట్రైనింగుకు హాజరవుతారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఆఖరి రోజు రాహుల్ గాంధీ వచ్చే అవకాశముంది.

News February 19, 2026

ముంబైలో HYD ఫ్యూచర్ ప్లాన్ చెప్పేసిన రేవంత్

image

సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో HYD ఎలా ఉండబోతోందో ముంబైలో చెప్పేశారు. ప్రభుత్వం చేపట్టనున్న చర్యలను అక్కడ జరిగిన క్లైమేట్ వీక్ సదస్సులో వెల్లడించారు. తొమ్మిదేళ్లలో సిటీని నెట్ జీరో సిటీగా మార్చడం, విద్యుత్ వినియోగం 34 వేల మెగావాట్లకు పెంచడం, 2 లక్షల ఆటోలను రెట్రోఫిట్ చేయడం, 3,500 ఆర్టీసీ బస్సులను ఈవీ బస్సులుగా మార్చడం.. మెట్రో రైల్ విస్తరణను 200 కి.మీ.కు విస్తరించడం లాంటి ప్లాన్స్‌ను వివరించారు.

News February 19, 2026

HYDలో అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్..!

image

FEB 20,21,22 తేదీల్లో 3రోజులు HYDలో అగ్రి షో పేరుతో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ తెలిపారు. NTR స్టేడియంలో ఈ ప్రోగ్రాం ఉంటుందని.. 3రోజుల్లో లక్షమంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. దేశ, విదేశాల నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500కుపైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. www.rbagrishow.com.