News January 17, 2026

సూర్యాపేట: మున్సిపల్ నగారాకు ముందే రాజకీయ సెగలు

image

సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈసారి అభ్యర్థుల ఎంపికలో సర్వేలకే ప్రాధాన్యత ఇస్తామని పార్టీలు సంకేతాలిస్తుండటంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. సామాజిక సమీకరణాలు, ప్రజాభిప్రాయం ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని భావిస్తుండటంతో.. గెలుపు గుర్రాల అన్వేషణలో నాయకత్వం నిమగ్నమైంది.

Similar News

News February 16, 2026

HYD: నిరుద్యోగులకు GOOD NEWS

image

HYDలోని కేంద్రీయ విద్యాలయ 2026-27 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు ఈనెల 19న ఉదయం 8 గంటల నుంచి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతతో పాటు (CTET) అర్హత కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News February 16, 2026

ఖమ్మం: నేడే ఎంపిక.. తీవ్ర ఉత్కంఠ..!

image

ఉమ్మడి ఖమ్మంలోని 7 మున్సిపాలిటీలకు ఛైర్మన్‌లు ఎవరనేది మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. పదవులపై ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీ ఎంపిక విధానంపై అంతర్గతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. స్థానిక సామాజిక సమీకరణాలు, నాయకత్వానికి సమీపత వంటి అంశాలు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. అధిష్టానం తుది నిర్ణయం మేరకే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు ఖరారుకానున్నాయి. కొత్తగూడెం మేయర్ ఖరారైన విషయం తెలిసిందే.

News February 16, 2026

నెల్లూరు: అడవిలో తప్పిపోయిన 12 మంది భక్తులు సేఫ్

image

రాపూరు (M) పంగిలి గ్రామ సమీపంలోని మామిడికొనలో ఉన్న వెలసిన శ్రీ మల్లయ్యస్వామి వారి దర్శనార్థం నెల్లూరు సిటీ అయ్యప్ప గుడి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది టెంపోలో వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో పంగిలి గ్రామానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో చీకటి కారణంగా 12 మంది దారి తప్పిపోయారు. పోలీసులు గాలించి వారిని బంధువులకు అప్పగించారు.