News January 17, 2026
సికింద్రాబాద్: ‘ర్యాలీకి పోలీసుల అనుమతి లేదు’

సికింద్రాబాద్ సాధన సమితి నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ సీపీ ఈ మేరకు స్పష్టం చేశారు. భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయ, ప్రజావర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
Similar News
News February 16, 2026
HYD: మీరూ సింగిల్‌గా ఉన్నారా?

ఒంటరి జీవితంతో యువతలో మానసిక వేదన పెరుగుతోందని కాప్రా డా.సువర్ణ తెలిపారు. గ్రేటర్ పరిధిలో యువతకు 34 ఏళ్లు దాటినా సింగిల్‌గా ఉంటున్నారని తెలిపారు. దీనికి కారణం పెళ్లిళ్లు కాకపోవడం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోతున్నారని వివిధ సర్వేల్లో వెల్లడైనట్లు పేర్కొన్నారు. యుక్త వయసులో వృత్తి కోర్సులను ఎంచుకోవడం, కుటుంబంతో కలిసి ఉండటం, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని సూచించారు.
News February 16, 2026
HYD: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్‌లో 10, HYD స్కార్ట్ డివిజన్‌లో 8, HYD సౌత్ ఈస్ట్ 16, సికింద్రాబాద్ డివిజన్‌లో 54 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం నెలకు రూ.12,000-29,380, వయసు 18-40 ఉండాలి.
News February 16, 2026
HYD: నిరుద్యోగులకు GOOD NEWS

HYDలోని కేంద్రీయ విద్యాలయ 2026-27 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు ఈనెల 19న ఉదయం 8 గంటల నుంచి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతతో పాటు (CTET) అర్హత కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.


