News January 17, 2026

ఉమ్మడి జిల్లాలో క్రమంగా తగ్గుతున్న చలి తీవ్రత

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో 12.5℃ నమోదవ్వగా, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని నేరెళ్లలో 14.5℃ నమోదైంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ఇందుర్తిలో 15.0℃, పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లిలో 15.3℃ కనిష్ఠ ఉష్ణోగ్రతగా నమోదైంది. అటు పగటి ఉష్ణోగ్రతలు కూడా జరుగుతున్నాయి.

Similar News

News April 1, 2026

NLG: ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు.. నిర్మాణంలో జాప్యం

image

జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులు జాప్యంతో సాగుతున్నాయి. గంధంవారిగూడెంలో ఒక బ్లాక్ మినహా మిగిలినవి ప్రాథమిక దశలోనే ఉన్నాయి. మునుగోడు, గడ్డిపల్లి, చిలుకూరు, తుర్కపల్లిలో నిర్మాణాలు ఆరంభంలోనే ఉండగా, నకిరేకల్‌లో స్థలసేకరణ మాత్రమే పూర్తయింది. సాగర్, DVK, MLGలో అసంపూర్తిగా ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి స్కూళ్లు సిద్ధం కావడం కష్టంగానే ఉంది.

News April 1, 2026

GK: భారతీయ రైల్వే – కీలక విషయాలు

image

*మొదటి రైలు: భారతదేశంలో మొదటి రైలు ఏప్రిల్ 16, 1853న ముంబై (బోరి బందర్) నుంచి థానే వరకు (34 కి.మీ) నడిచింది.
*రైల్వే జోన్లు: ప్రస్తుతం 19 రైల్వే జోన్లు ఉన్నాయి (మెట్రో రైల్ కోల్‌కతాతో కలిపి).
*అతి పొడవైన రైలు మార్గం: వివేక్ ఎక్స్‌ప్రెస్ – ఇది దిబ్రూగఢ్ (అస్సాం) నుండి కన్యాకుమారి (తమిళనాడు) వరకు ప్రయాణిస్తుంది.
*మొదటి విద్యుత్ రైలు: 1925లో ముంబై నుండి కుర్లా మధ్య నడిచిన డెక్కన్ క్వీన్.

News April 1, 2026

చందమామపైకి చిన్నారి బొమ్మ

image

దాదాపు 53 ఏళ్ల తర్వాత నాసా చేపట్టే మానవసహిత చందమామ యాత్ర (Artemis II) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మిషన్‌లో నలుగురు వ్యోమగాములతో పాటు ‘రైజ్’ అనే బొమ్మ కూడా ప్రయాణం చేయనుంది. దీన్ని కాలిఫోర్నియాకు చెందిన 8 ఏళ్ల లూకాస్ తయారు చేశాడు. 1961 నుంచి ఉన్న ‘జీరో గ్రావిటీ ఇండికేటర్’ సంప్రదాయం ప్రకారం వ్యోమగాములు ఓ బొమ్మను తీసుకెళ్తారు. ఈసారి 50 దేశాల నుంచి వచ్చిన 2,600 ఎంట్రీల్లో ఇది ఎంపికైంది.