News January 17, 2026

కామారెడ్డి: కొండెక్కిన చికెన్ ధర

image

కామారెడ్డి జిల్లా మార్కెట్‌లో నాన్-వెజ్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈరోజు స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.302కు చేరి సామాన్యులకు షాకివ్వగా.. కోడి గుడ్డు హోల్‌సేల్ ధర రూ.5.80 పైసలుగా నమోదైంది. దీంతో రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.6.50 వరకు విక్రయిస్తున్నారు. పండుగ డిమాండ్, వారాంతం కావడంతో చికెన్, గుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News April 18, 2026

ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు

image

హార్ముజ్‌‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు ఇండియన్ నౌకలపై IRGC కాల్పులు <<19684352>>జరపడాన్ని<<>> భారత్ సీరియస్‌గా తీసుకుంది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నాయి. కాగా దాడులకు గురైన నౌకలోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

News April 18, 2026

MGU బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో బీటెక్ పరీక్షల షెడ్యూల్ ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-2,4 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1,3 (బ్యాక్ లాగ్) పరీక్షలు మే-5 నుంచి మే-21 మధ్య జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టైం టేబుల్స్‌ను అధికారక ఎంజీయూ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.

News April 18, 2026

మెదక్: ఎల్లుండి నుంచి సంక్షేమ వారోత్సవాలు..!

image

TGలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహించాలని GOVT నిర్ణయించింది. ఈ మేరకు CS కె.రామకృష్ణారావు శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక ఆదేశాలు జారీ చేశారు. APR 20న శుభ్రత, 21న టాలెంట్ ఫెస్ట్, 22న మౌలిక సదుపాయాలు, 23న పేరెంట్స్ మీటింగ్, 24న నైపుణ్యాభివృద్ధి, 25న సమ్మర్ క్యాంపులు, 26న బడి బాట ఉంటుందన్నారు.