News January 17, 2026

సిరిసిల్ల: ఎన్నికల ఖర్చుపై కార్యదర్శుల్లో ఆందోళన

image

గత పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. నామినేషన్లు ప్రారంభం నుంచి ఎన్నికల అధికారులు, సిబ్బందికి అల్పాహారం, భోజనాలు, టీ, స్నాక్స్ ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లాలో ఒక్కో కార్యదర్శి రూ.30 వేల పైగా ఖర్చు చేశారు. GPని బట్టి రూ.6-8 వేల వరకు ఖర్చులు అందించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలరోజులు గడిచినా ఖర్చులకు లెక్కలు అడగకపోవడంపై కార్యదర్శుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Similar News

News February 8, 2026

జగిత్యాల జిల్లాలో పోటాపోటీగా ప్రచారాలు

image

జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రచారం చేశారు. బీజేపీ నుంచి ఎంపీ అరవింద్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీఆర్ఎస్ తరఫున జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, టీఆర్పి తరపున తీన్మార్ మల్లన్న, జనసేన తరఫున గబ్బర్ సింగ్ టీం ప్రచారం చేశారు.

News February 8, 2026

రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. UPDATE

image

TG: యాసంగికి సంబంధించి రైతు భరోసా నిధుల పంపిణీకై RBIకి రూ.9వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం ఇండెంటు పెట్టింది. 13 ఏళ్ల కాలపరిమితితో రూ.2వేల కోట్లు, 16 ఏళ్ల కాలపరిమితితో రూ.2వేల కోట్లు, 21 ఏళ్లతో రూ.2,500 కోట్లు, 27 ఏళ్లతో రూ.2,500 కోట్ల రుణం తీసుకోనుంది. ఈ నెల 10న ఈ రుణం ప్రభుత్వ ఖాతాలో జమ కానుంది. కాగా మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా(ఎకరాకు రూ.6,000) ఇస్తామని CM ప్రకటించిన సంగతి తెలిసిందే.

News February 8, 2026

గుంటూరులో వైసీపీ కొత్త వ్యూహం..?

image

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా అంబటి మౌనిక పేరు ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవికి చెక్ పెట్టే వ్యూహంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధికారిక ప్రకటన చేస్తారని జిల్లాలో టాక్. కాగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీకి ఇన్‌ఛార్జ్ లేరు.