News January 17, 2026
గోరంట్ల మాధవ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టారంటూ నమోదైన కేసులో మాజీ MP గోరంట్ల మాధవ్‌పై విజయవాడ పోక్సో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు మాధవ్‌పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు.
Similar News
News January 29, 2026
మేడారంలో మొబైల్ అంబులెన్సుల సేవలు!

మేడారం జాతర సందర్భంగా భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మొబైల్ అంబులెన్సులు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. ద్విచక్ర వాహనాలపై సన్నద్ధంగా తిరుగుతున్న వైద్య సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఘటనా స్థలానికే చేరుకుని బాధితులకు తక్షణ ప్రథమ చికిత్స అందిస్తున్నారు. జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ సులభంగా చేరుకునే విధంగా ఈ బైక్ అంబులెన్సులను వినియోగిస్తున్నారు.
News January 29, 2026
సోలార్ విద్యుత్ పై ప్రగతి సాధించాలి: కలెక్టర్

PM ముఫ్తీ బిజిలీ యోజన & RDSS పథకాలను సంబంధిత అధికారులు, బ్యాంకర్స్ సమన్వయంతో పనిచేసి మంచి ప్రగతిని సాధించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు.
బుధవారం ఏలూరు కలెక్టరేట్‌లో ఆమె అధికారులతో సమీక్షించారు. ప్రతి సచివాలయంలో సోలార్ విద్యుత్ పై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. 100 అప్లికేషన్లు సేకరించి కనెక్షన్లు ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న అప్లికేషన్స్ వెంటనే పూర్తి చేయాలన్నారు.
News January 29, 2026
రాష్ట్రంలో తూ.గో జిల్లాకు ద్వితీయ స్థానం

RTC నిర్వహించిన లాజిస్టిక్స్ డోర్ డెలివరీల్లో తూ.గో జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. అందుకు విశేషంగా కృషి చేసిన జిల్లా ప్రజా రవాణా అధికారి వై.ఎస్.ఎన్ మూర్తిని విజయవాడ కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావులు అభినందించారు. ప్రశంసా పత్రం, రివార్డుతో డీపీటీఓ మూర్తిని సత్కరించారు. ఆర్టీసీ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


