News January 17, 2026
నిర్మల్: ప్రతిపాదనలన్నింటికీ సీఎం ‘ఓకే’

నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి భాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. స్థానిక ప్రజాప్రతినిధులు కోరిన పలు అభివృద్ధి పనులకు సానుకూలంగా స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తులపై సైతం సీఎం సానుకూలత వ్యక్తం చేస్తూ నిధులు మంజూరు చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని సీఎం ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Similar News
News February 4, 2026
HYD: స్మోకింగ్, ఆల్కహాల్‌తో క్యాన్సర్: డా.దుర్గాప్రసాద్

పర్యావరణ కాలుష్యం, స్మోకింగ్, ఆల్కహాల్ వ్యసనాలతో క్యాన్సర్ వస్తుందని GGH మహేశ్వరం ENT సర్జన్ డా.KVN దుర్గాప్రసాద్ అన్నారు. ‘ఆహారం, శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉన్నా, దగ్గితే రక్తం పడినా, గడ్డలు, పుండ్లు, దగ్గు తగ్గకపోవడం లక్షణాలు. గుడ్లు, ఆకుకూరలు, శనగపప్పు ఉండలు ఎక్కువ తీసుకోవాలి. ప్రొటీన్, విటమిన్లు శరీరానికి సరిగ్గా అందాలి. భయం వీడి చికిత్స తీసుకోవాలి’ అని సూచించారు.
నేడు వరల్డ్ క్యాన్సర్ డే
News February 4, 2026
అనంతపురంలో రూ.63 లక్షల CMRF చెక్కుల పంపిణీ

అనంతపురం ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం MLA దగ్గుపాటి ప్రసాద్ సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. 50 మంది బాధితులకు రూ.63 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఇప్పటి వరకు ఒక్క అనంతపురం నియోజకవర్గంలోనే 452 మందికి సుమారు రూ.5 కోట్ల ఆర్థిక సాయం అందించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
News February 4, 2026
వచ్చే నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

TG: తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తుందని Dy.CM మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చే దిశగా బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి గద్దర్ అవార్డుల స్క్రీనింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఉగాది పండుగ రోజున (19న) అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని వెల్లడించారు.


