News January 17, 2026

GNT: కలెక్టర్‌ని కలిసిన జీఎంసీ కమిషనర్

image

గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ కె. మయూర్ అశోక్ శనివారం కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియాను కలిశారు. కార్పొరేషన్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన కమిషనర్ కలెక్టర్‌ని కలిసి ఆమెకు మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా నగరాభివృద్ది, ఇతర కీలక అంశాలపై ఇరువురు చర్చించారు.

Similar News

News February 14, 2026

కోటప్పకొండ తిరునాళ్లకు 650 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. నెల్లూరు జోన్ ఈడీ నాగేంద్రప్రసాద్ తెలిపిన ప్రకారం కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి మొత్తం 650 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట నుంచి నిమిషానికో సర్వీసు అందుబాటులో ఉంటుంది. కొండపైకి రాకపోకలకు 60 సప్తగిరి బస్సులు ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందన్నారు.

News February 14, 2026

GNT: శివరాత్రి రద్దీకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి సందర్భంగా గోవాడ, క్వారీ తిరునాళ్లకు భక్తుల రాకపోకలు సులభంగా ఉండేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుమారు 50 బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచే నిరంతర సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతామని చెప్పారు. తెనాలి మార్కెట్, ఓవర్‌బ్రిడ్జి వద్ద ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. టిక్కెట్ ధరలు యథాతథంగా ఉంటాయి.

News February 14, 2026

రాజ్యసభ భరిలో రాజధాని జిల్లా నేతలు.?

image

AP నుంచి రాజ్యసభలో 4 స్థానాలు ఖాళీ అవుతుండగా NDA కూటమికి ఆ స్థానాలన్నీ దక్కుతాయన్న వార్తలతో రాజధాని గుంటూరు జిల్లా నేతలు రాజ్యసభ సీటు కోసం పావులు కదుపుతున్నారు. వీరిలో భాష్యం రామకృష్ణ పేరు బలంగా వినిపిస్తుండగా గళ్లా జయదేవ్, కిలారు రాజేశ్, లింగమనేని రమేశ్ రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి రాజ్యసభ సీటు ఎవరికి వస్తుందో కామెంట్ చేయండి.