News January 17, 2026

3 రోజుల్లోనే రూ.61.1 కోట్లు

image

నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ.61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 14 విడుదలైన ఈ మూవీ తొలి రోజు రూ.22 కోట్లు, రెండు రోజుల్లో రూ.41.2కోట్లు సాధించింది. మారి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు.

Similar News

News February 19, 2026

పిల్లలకు మసాజ్ చేస్తున్నారా?

image

నెలల వయసున్న పిల్లలకి మసాజ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. దీని వల్ల వారికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మసాజ్ వల్ల పిల్లల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. గ్రోత్ హార్మోన్‌ను పెంచుతుంది. బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీస్‌కి మసాజ్ ఎంతో ఉపకరిస్తుందని సూచిస్తున్నారు.

News February 19, 2026

క్యాబేజీ విత్తనాలను నాటే విధానం – జాగ్రత్తలు

image

క్యాబేజీ విత్తనాలు నాటే ముందు నేలను 4-5 సార్లు.. 100 చ.మీ. విస్తీర్ణంలో 25-30 గంపల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. విత్తనాలను సన్నని ఇసుకతో కప్పి అవి మొలిచే వరకు రోజూ నీరు పెట్టాలి. మొక్కలు మొలకెత్తాక ఎండిన ఆకులను తీసేయాలి. నారు కుళ్లు తెగులు సోకకుండా లీటరు నీటికి 3గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌తో నేలను తడపాలి. ఆకుతినే పురుగు నుంచి నారు రక్షణకు లీటరు నీటికి మలాథియాన్ 2ml కలిపి పిచికారీ చేయాలి.

News February 19, 2026

ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

image

ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కాల్సిన మూవీ రద్దయిందన్న ప్రచారంలో నిజం లేదని సినీవర్గాలు తెలిపాయి. ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి-2’తో బిజీగా ఉన్నారని, అవి పూర్తయ్యాక ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు ఉంటుందని పేర్కొన్నాయి. మరోవైపు వర్మ ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ తీసేందుకు సిద్ధమయ్యారు. రిషబ్ శెట్టి నటిస్తున్న ఆ సినిమా పూజా కార్యక్రమం ఈనెల 22న హంపీలో జరగనుంది.