News January 17, 2026
HYD: 10 నుంచి 12 జోన్లుగా HMDA విస్తరణ

HYD వేదికగా HMDA పునర్వ్యవస్థీకరణకు వేగం పెరిగింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. HMDA 10 నుంచి 12 జోన్లుగా విభజన చేసే అవకాశం ఉంది, ఈ మేరకు అదనపు అధికారులను నియమించనున్నారు. జోనల్ కార్యాలయాల పరిధిలో అనుమతులు ఇవ్వని అంశాలపై స్పష్టతనిస్తూ, అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.
Similar News
News February 22, 2026
వనపర్తి: శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు.. అద్దెకు తీసుకోవాలని డీఎం పిలుపు

వివాహాలు, విహారయాత్రల కోసం తక్కువ ధరకు ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వనున్నట్లు వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రైవేటు వాహనాల కంటే తక్కువ ఖర్చుతో పాటు, డ్రైవర్ బత్తా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
79957 01851, 96765 63377, 73828 29313
News February 22, 2026
విశాఖ: పాత కక్షలతో కత్తితో దాడి..

జగదాంబ జంక్షన్ వద్ద శనివారం రాత్రి రౌడీషీటర్ అప్పులరాజుపై ఆటో డ్రైవర్ కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. పాత గొడవల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసిన మహారాణిపేట పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని సీఐ దివాకర్ యాదవ్ తెలిపారు.
News February 22, 2026
కాసేపట్లో గుంటూరు రానున్న సీఎం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో గుంటూరు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ బందోబస్తు చర్యలు చేపట్టింది. ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు ఏర్పాట్లతో పాటు హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎస్పీతో పాటు డీఎస్పీ అజీజ్, తదితరులు ఉన్నారు.


