News January 17, 2026
UPDATE: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్లు మృతి

పాఠశాల విధులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు టీచర్ల ప్రాణాలను బలిగొంది. నలుగురు ఉపాధ్యాయులు కలిసి కారులో తుంగతుర్తికి బయలుదేరారు. మార్గమధ్యంలో కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న ఇసుక కుప్పపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తుంగతుర్తి KGBV ఎస్‌వో కల్పన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన రావులపల్లి HM గీతా రెడ్డిని HYDకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
Similar News
News February 20, 2026
శాసనమండలిలో వాయిదా తీర్మానానికి YCP పట్టు..!

ఏపీ శాసనమండలిలో అజెండాను కాదని కల్తీ నెయ్యి, హెరిటేజ్ అంశాలపై చర్చించాలని వైసీపీ సభ్యులు నాలుగు రోజులుగా పట్టుబడుతున్నారు. సభా కార్యక్రమాలు పక్కనపెట్టి వీటిపై చర్చించేందుకు వాయిదా తీర్మానం కోరుతున్నారు. సాధారణంగా సభలో మెజారిటీ సభ్యులు అంగీకరిస్తేనే స్పీకర్ లేదా ఛైర్మన్ అజెండాను వాయిదా వేస్తారు. అయితే అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ విషయంలో సయోధ్య కుదరకపోవడంతో కౌన్సిల్‌లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి లక్షణాలు

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెల్లో తీవ్ర జ్వరం ఉంటుంది. నోటి నుంచి చొంగ కారి గొర్రె నోరు మొత్తం ఎర్రగా మారుతుంది. ముఖం వాచి, మూతి, పెదవులు, చిగుళ్లు, నాలుకపై పుండ్లు ఏర్పడతాయి. గొర్రె నోటి నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. వ్యాధి మరింత ముదిరితే నాలుక నీలి రంగులోకి మారుతుంది. ఈ లక్షణాలను బట్టి గొర్రెల్లో నీలి నాలుక వ్యాధిని గుర్తించవచ్చు.