News January 17, 2026
ఖమ్మం, భద్రాద్రిలో మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఇవే.!

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీ ఛైర్మన్ల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ – ఎస్టీ జనరల్, ఖమ్మం కార్పొరేషన్ – జనరల్ మహిళ, అశ్వారావుపేట మున్సిపాలిటీ – జనరల్ మహిళ, ఇల్లందు – బీసీ మహిళ, కల్లూరు – ఎస్టీ జనరల్, మధిర – జనరల్ మహిళ, వైరా – జనరల్ మహిళ, సత్తుపల్లి – జనరల్ మహిళ, ఏదులాపురం – ఎస్సీ మహిళకు కేటాయించారు.
Similar News
News April 17, 2026
పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు

రహదారి ప్రమాదాల నివారణకు అవగాహన అత్యంత ముఖ్యం అని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ తెలిపారు. దమ్మపేటలో ఈరోజు జరిగిన అర్రైవ్ అలైవ్ కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు, యువత ముందుకు వచ్చి సమాజంలో రహదారి భద్రతపై చైతన్యం కల్పించాలని కోరారు. కేటీపీఎస్, బీటీపీఎస్, సింగరేణి వంటి పరిశ్రమల కారణంగా ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇప్పటికే 38 బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు చేపట్టామని తెలిపారు.
News April 17, 2026
25న జరిగే పాలిసెట్‌కు 17 పరీక్షా కేంద్రాలు: అనకాపల్లి కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో ఈనెల 25న నిర్వహించే పాలిసెట్-2026కి మొత్తం 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం వివిధ విభాగాలకు చెందిన జిల్లాస్థాయి అధికారులతో పాలిసెట్‌పై సమీక్ష నిర్వహించారు. మొత్తం 9,413 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
News April 17, 2026
ఎరువుల అక్రమ వినియోగం జరగకుండా చూడాలి: అనకాపల్లి కలెక్టర్

రాయితీపై రైతులకు పంపిణీ చేస్తున్న ఎరువులు అక్రమంగా వినియోగం కాకుండా చూడాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై శుక్రవారం వివిధ శాఖల అధికారులతో అనకాపల్లి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. మండల స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.


