News January 17, 2026
గద్వాల జిల్లాలో మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ఇలా..!

గద్వాల జిల్లాలో గద్వాల అయిజ వడ్డేపల్లి అలంపూర్ 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. శనివారం వార్డులు, ఛైర్మన్ స్థానాల రిజర్వేషన్లు ప్రకటించింది. గద్వాల ఛైర్మన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించింది. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపల్ ఛైర్మన్ స్థానాలను బీసీ జనరల్‌కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
Similar News
News February 11, 2026
సంగారెడ్డి: ఎన్నికలు జరిగే ప్రదేశాల్లో సెలవు

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో నేడు జరగనున్న ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య స్థానిక సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు కలెక్టర్‌కు ఉన్న అధికారాలను ఉపయోగించి సెలవుదినంగా ప్రకటించినట్లు వివరించారు.
News February 11, 2026
జనగామ జిల్లా యువతికి యూజీసీ నెట్‌లో ఆలిండియా రెండో ర్యాంకు!

రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామానికి చెందిన మాచర్ల రేణుక-వాసు దంపతుల కుమార్తె శిరీష యూజీసీ నెట్‌లో 99.901 పర్సంటేజ్ సాధించి ఆలిండియా రెండో ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా యువతిని కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా గ్రామస్థులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.
News February 11, 2026
తిరుపతిలో విషాదం.. భర్త వేధింపులకు వివాహిత బలి

భర్త వేదింపులను తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలోని ఆటోనగర్‌లో మంగళవారం జరిగింది. కుటుంబీకుల వివరాల మేరకు..ఆటోనగర్‌లో నివసిస్తున్న ఉదయ్, మౌలికకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వెరొక మహిళతో చనువుగా ఉంటూ ఇంటికొచ్చి భార్యను వేదించేవాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నట్లు వారు ఆరోపించారు. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదుతో అలిపిరి ఎస్‌ఐ నరసింహారావు కేసు నమోదు చేశారు.


