News January 17, 2026

మంచిర్యాల: మేయర్, ఛైర్మన్‌ల రిజర్వేషన్లు ఖరారు

image

జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలకు మేయర్, ఛైర్మన్ రిజర్వేషన్లను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటించారు. మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ పీఠం బీసీ జనరల్‌కు కేటాయించారు. బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలను జనరల్ మహిళకు, లక్షెట్టిపేట ఎస్సీ జనరల్‌కు, చెన్నూర్ బీసీ మహిళకు ఖరారు చేశారు. ఈ ప్రకటనతో ఎన్నికల సందడి మొదలైంది.

Similar News

News February 21, 2026

నిర్మల్: గోదావరి నదిలో మహిళ శవం లభ్యం

image

బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆమె మహారాష్ట్ర కర్కేల్లి గ్రామానికి చెందిన మోతేవార్ అనసూయగా గుర్తించారు. బుధవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 21, 2026

నెల్లూరు: ఫేస్‌బుక్ పరిచయం.. ప్రాణం తీసుకున్న యువకుడు

image

ఫేస్‌బుక్ పరిచయం ఓ యువకుడి ప్రాణాన్ని తీసింది. నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్(26)కు కర్నూలు(D) పత్తికొండకు చెందిన దంపతులు FBలో పరిచయమయ్యారు. చెన్నైలో తనకు హోటల్ ఉందని, కర్నూలులో పెట్టే హోటల్‌లో భాగస్వాములు కావాలని ఆ దంపతులకు చెప్పాడు. పత్తికొండకు వెళ్లి అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఆమెపైనే కన్నేసిన తనతో రావాలంటూ వేధించగా నిరాకరించింది. దీంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 21, 2026

నేడు శ్రీవారి ఆలయాల్లో ‘కూటమి’ పూజలు, సంప్రోక్షణలు

image

AP: వైసీపీ సభ్యులు శ్రీవారి ఫొటోలను శాసనమండలికి తీసుకొచ్చి మహాపచారం చేశారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రెస్‌మీట్‌లు నిర్వహించాలని, నేడు శ్రీవారి ఆలయాల్లో పూజలు, సంప్రోక్షణలు చేయాలని నిర్ణయించారు. వేంకటేశ్వర స్వామి చిత్రాలను అపవిత్రం చేసి జగన్, వైసీపీ సభ్యులు మహాపరాధానికి పాల్పడ్డారని, దీనిపై హిందూ భక్తులకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది.