News January 17, 2026
PDPL: ‘మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాం’

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో తెలంగాణ రక్షణ సమితి(D) అభ్యర్థులు పోటీ చేస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు అన్నారు. PDPLజిల్లా కేంద్రంలో శనివారం జరిగిన పార్టీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్ తమకు ‘టెలిఫోన్’ గుర్తును కేటాయించిందన్నారు. భవిష్యత్తు ఎన్నికలలో పార్టీ నుంచి అభ్యర్థులను పోటీలో నిలిపి గెలిపించుకుంటామన్నారు.
Similar News
News April 19, 2026
దామరగిద్ద: కానుకుర్తి రిజర్వాయర్‌కు భూమి పూజ

మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం దామరగిద్ద సమీపంలోని కానుకుర్తి రిజర్వాయర్‌కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం కానుకుర్తి గ్రామ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం అభినందనీయమని, వారి త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
News April 19, 2026
అచ్చంపేట: వడదెబ్బతో ఒకరి మృతి

అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో ఎండల తీవ్రతకు ఒకరు బలయ్యారు. గ్రామానికి చెందిన బాలయ్య (35) వడదెబ్బకు గురై ఆదివారం ఉదయం మృతి చెందాడు. మద్యపానానికి అలవాటు ఉన్న బాలయ్య, తీవ్ర ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రాణాలు వదిలినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అధికారులు స్పందించి బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News April 19, 2026
NGKL: రైతుల ఖాతాలలో రేపు రెండో విడత రైతు భరోసా నిధులు

రైతుల ఖాతాలలో రేపు రెండో విడత రైతు భరోసా నిధులు జమ అవుతాయని నాగర్‌కర్నూల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యశ్వంత్ రావు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో జరిగే బహిరంగ సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేస్తారని తెలిపారు. జిల్లాలోని 63 రైతు వేదికల వద్ద సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని లైవ్ ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 2.5 లక్షల మందికి రూ.103 కోట్ల వారి ఖాతాలో జమ కానున్నాయి.


