News January 17, 2026

DRDOలో JRF, RA పోస్టులు

image

<>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ & స్టోర్స్ రీసెర్చ్& డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DMSRDE) 3 పోస్టులను భర్తీ చేయనుంది. PhD(కెమిస్ట్రీ), పీజీ, బీఈ, బీటెక్/ ఎంఈ, ఎంటెక్, NET, GATE అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 12న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. JRFకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా, రీసెర్చ్ అసోసియేట్‌కు 35ఏళ్లు. RAకు స్టైపెండ్ నెలకు రూ.67వేలు, JRFకు 37వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in

Similar News

News April 18, 2026

మరో ఆపరేషన్ సిందూర్‌కు గెట్ రెడీ: సీడీఎస్

image

ఆపరేషన్ సిందూర్ నెక్స్ట్ ఫేజ్‌కు భారత దళాలు సిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పిలుపునిచ్చారు. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం ఇంకా మెరుగవ్వాలని సూచించారు. ఆపరేషన్స్‌లో పైచేయి సాధించేందుకు ఆర్మీ సమాచార సేకరణపై దృష్టిపెట్టిందన్నారు. OPSకు త్వరలో ఏడాది (మే 7) పూర్తికానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 18, 2026

బీజేపీ నుంచే అత్యల్పంగా మహిళా ఎంపీలు: మహువా

image

మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంతో విపక్షాలపై PM మోదీ సహా BJP నేతలు చేస్తున్న విమర్శలకు TMC MP మహువా మొయిత్రా Xలో కౌంటరిచ్చారు. లోక్‌సభలో BJP నుంచే అత్యల్పంగా మహిళా MPలు(240 మందిలో 31 మంది.. 12.90%) ఉన్నారని గుర్తు చేశారు. తమ పార్టీ నుంచి గెలిచిన 29 మంది MPల్లో 11 మంది మహిళలు(37.90%) అని పేర్కొన్నారు. ఇప్పుడున్న 543 సీట్లకు ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయకుండా ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు.

News April 18, 2026

‘పదహారణాల’ తెలుగమ్మాయి అంటే?

image

అచ్చమైన తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తే పదహారణాల తెలుగమ్మాయి అని అంటాం. ఒక కంప్లీట్ ఉమెన్ అని అర్థం. పూర్వం 16 అణాలు కలిస్తే ఒక పూర్తి రూపాయి. తన భాష, భావన, నడక, నడత, ఆహార్యం, వస్త్ర ధారణ తదితర 16 అంశాల్లో తెలుగుదనాన్ని నింపుకున్న అమ్మాయిని మన కవులు ఇలా పోల్చారు.
* ఒక బేడా= 2 అణాలు. ఒక పరకా=1/2 అణా, ఒక కాని=1/4 అణా, ఒక దమ్మిడి= 1/12 అణా.
<<-se>>#EPICSAYINGS<<>>