News April 26, 2024

RCB అంటే కోహ్లీ.. ఒక్కడిపై ఎన్నో రికార్డులు

image

✒ RCB తరఫున ఎక్కువ మ్యాచ్‌లు- 246
✒ ఎక్కువ పరుగులు- 7,642
✒ మోస్ట్ ఫోర్లు- 679, సిక్సులు- 250
✒ సెంచరీలు- 8, హాఫ్ సెంచరీలు- 60
✒ మోస్ట్ క్యాచ్‌లు- 112
✒ కెప్టెన్‌గా ఎక్కువ విజయాలు- 66
✒ మోస్ట్ సెంచరీ భాగస్వామ్యాలు- ABD/కోహ్లీ 10
✒ జట్టులో ఎక్కువసార్లు టాప్ స్కోర్లు- 58

Similar News

News February 3, 2026

నెల్లూరు: పసికందును వదిలి వెళ్లిపోయారు

image

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 3 నెలల క్రితం మగబిడ్డను వదిలి వెళ్లారు. బరువు తక్కువగా ఉన్న మగ శిశువును చిన్నపిల్లల వైద్యులే అన్నితామై సంరక్షించారు. వదిలి వెళ్లినవారు రాకపోవడంతో వారిని గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంచార జీవనం గడుపుతున్న రేణుక గతేడాది అక్టోబర్‌లో అల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కాగా శిశువు బరువు తక్కువగా ఉందని తన భర్తతో వచ్చి ఆసుపత్రిలో చేరారని తెలిపారు.

News February 3, 2026

మహిళలూ.. ఈ లక్షణాలున్నాయా? జాగ్రత్త

image

క్యాన్సర్ లక్షణాలు అన్నిసార్లూ బయటకు కనిపించవు. ముఖ్యంగా మహిళల్లో కొన్ని క్యాన్సర్లు నిశ్శబ్ధంగా శరీరంలో వ్యాపిస్తాయంటున్నారు నిపుణులు. చాలా క్యాన్సర్లను ప్రారంభదశలో గుర్తించడం కష్టమని చెబుతున్నారు. అందుకే మహిళల్లో అసాధారణ వాపు, దీర్ఘకాల అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, చర్మంపై మార్పులు, అసాధారణ రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News February 3, 2026

గతేడాది 19 విమాన ప్రమాదాలు

image

గతేడాది దేశంలో 19 విమాన ప్రమాదాలు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ ఘటనలపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు చేసిందని వెల్లడించారు. వీటికి సంబంధించిన నివేదికలను AAIB వెబ్‌సైట్‌లో ప్రచురించామని ఆయన తెలిపారు.