News January 17, 2026
మెదక్: ప్రాణరక్షణకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ ధరించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కేవలం నిబంధనగా కాకుండా, వ్యక్తిగత భద్రతగా భావించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు.
Similar News
News January 28, 2026
MDK: మెదక్ కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ను కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్ ద్వారా అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై నిఘా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
News January 28, 2026
ఏడుపాయల జాతర ఎల్లలు దాటేలా నిర్వహించాలి: కలెక్టర్

ఏడుపాయల వనదుర్గా మాత జాతరను ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో భక్తులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్లు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధిక ధరలు, కల్తీ ఆహారం, మత్తు పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
News January 28, 2026
మెదక్: ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర జరగాలి

ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత జాతరను అత్యంత ఘనంగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, జాతర పరిసరాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


