News January 17, 2026
గొల్లప్రోలులో కోర్టు సినిమా హీరోయిన్ సందడి

గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని ప్రసిద్ధ అపర్ణాదేవి ఆలయాన్ని శనివారం కోర్టు సినిమా ఫేమ్ శ్రీదేవి సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు ఆకొండి ప్రభాకర్ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆమె కుంకుమ పూజలు చేశారు. పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు హీరోయిన్‌ను ఘనంగా సత్కరించారు. శ్రీదేవి రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.
Similar News
News February 17, 2026
సంగారెడ్డి: Btech పూర్తి.. 24 ఏళ్లకే కౌన్సిలర్!

సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 24 ఏళ్ల మనీషా సంచలనం సృష్టించారు. బీటెక్ పూర్తి చేసిన ఆమె 30వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. అతి చిన్న వయసులోనే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మనీషా తన గెలుపునకు సహకరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
News February 17, 2026
KCRకి CM రేవంత్, YS జగన్ బర్త్‌డే విషెస్

TG: KCR బర్త్ డే సందర్భంగా పలువురు నేతలు SM వేదికగా ఆయనకు విషెస్ తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో KCRకి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని CM రేవంత్ ఆకాంక్షించారు. ‘నా ఫరెవర్ హీరోకి 72వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజూ నన్ను ఇన్‌స్పైర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు’ అని KTR ట్వీట్ చేశారు. AP మాజీ సీఎం జగన్, హరీశ్‌రావు తదితరులు విషెస్ తెలియజేశారు.
News February 17, 2026
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్ అయ్యి 83,071 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 77 పాయింట్లు కోల్పోయి 25,605 వద్ద కొనసాగుతోంది. టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఎటర్నల్ షేర్లు 1%కుపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్, బీఈఎల్, హెచ్‌సీఎల్ టెక్ లాభాల్లో కొనసాగుతున్నాయి.


