News January 17, 2026

ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరం: ASF ఎస్పీ

image

మొబైల్ ఫోన్స్‌కు వచ్చే ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరమని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ASF జిల్లా ఎస్పీ నితిక పంత్ సూచించారు. ఫైల్స్ ఓపెన్ చేస్తే సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. అలాంటి ఫైల్స్ ఓపెన్ చేస్తే మొబైల్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని వివరించారు.

Similar News

News February 17, 2026

బీర పంటకు నీటిని ఇలా అందిస్తే మేలు

image

బీర విత్తనాలను నాటడానికి ముందు పొలంలో నీరు పెట్టాలి. తర్వాత ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3-5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు నాలుగైదు రోజులకు ఒకసారి నీరు అందించాలి. మొక్కకు దగ్గరగా కాకుండా కాస్త దూరంలో ఎరువు వేయాలి. తర్వాత ఎరువుపై మట్టిని కప్పి నీటిని పెట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

News February 17, 2026

BREAKING: మొయినాబాద్‌లో దారుణ హత్య

image

మొయినాబాద్ మండల పరిధిలోని కాశింబౌళిలో రేయిన్‌బో క్రికెట్ గ్రౌండ్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ సహాయంతో కీలక ఆధారాలు సేకరించారు. మృతుడు ఎవరు? పాత కక్షల వల్ల హత్య జరిగిందా? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.

News February 17, 2026

ధురంధర్ మేకర్స్‌కు షాక్.. బ్లాక్‌లిస్ట్‌లో ప్రొడక్షన్ హౌస్?

image

ధురంధర్ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్న వేళ ఆ ఫిల్మ్ మేకర్స్‌కు షాక్ తగిలింది. ఈ సినిమా నిర్మాణ సంస్థ B62 స్టూడియోస్‌ను శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్ చేసేందుకు ముంబై కార్పొరేషన్(BMC) సిద్ధమైంది. అనుమతులు లేకుండా భవనాలపై షూటింగ్‌లు చేసి వరుస ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌లిస్ట్ అయితే భవిష్యత్తులో ముంబైలో షూటింగ్‌ చేపట్టేందుకు నిర్మాణ సంస్థకు అనుమతులు లభించవు.