News January 17, 2026
నల్గొండ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

నల్గొండ మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో, శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పాత మున్సిపల్ భవనంలోనే కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేషన్‌గా మారడంతో నగర అభివృద్ధికి మరిన్ని నిధులు, వసతులు సమకూరుతాయని తెలిపారు.
Similar News
News February 10, 2026
NLG: లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలే లక్ష్యం: వీపీ గౌతమ్

చిట్యాల మండలం పెద్దకాపర్తిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ సెక్రెటరీ వీపీ గౌతమ్, కలెక్టర్ బీ.చంద్రశేఖర్‌తో కలిసి తనిఖీ చేశారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మార్చి చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలే లక్ష్యమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయలక్ష్మి, సర్పంచ్ కాటం వెంకటేశం, తదితర అధికారులు పాల్గొన్నారు.
News February 10, 2026
పాత నేరస్థులపై బైండోవర్ కేసులు: నల్గొండ ఎస్పీ

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇప్పటికే 333 మంది రౌడీషీటర్లు, పాత నేరస్థులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా చేరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం, నగదు పంపిణీపై నిఘా ఉంచామని జిల్లా ఎస్పీ తెలిపారు.
News February 10, 2026
నల్గొండ: పార్టీ అభ్యర్థులకు రెబల్స్ సవాల్..!

ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన ఆయా పార్టీల నేతలు రెబల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. నల్గొండ కార్పొరేషన్‌తోపాటు MLG, DVK, హాలియా, చండూరు, చిట్యాల, నందికొండ మున్సిపాలిటీల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టించారు. కొందరు గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తుండగా మరికొందరు గెలుపోవటములను ప్రభావితం చేస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.


