News January 17, 2026

సంగారెడ్డి: రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం

image

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్ – 2026’ పేరిట 10 రోజుల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పోలీస్, రవాణా, ఆరోగ్య శాఖల సమన్వయంతో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని, ప్రాణ రక్షణే ఈ ఉద్యమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 15, 2026

రుషికొండ బీచ్‌లో బీటెక్ విద్యార్థి మృతి

image

రుషికొండ బీచ్‌లో మునిగి యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విశాఖలో బీటెక్ చదువుతున్న అరవింద్( 21) తన స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అక్కడ స్నానం చేస్తుండగా.. అరవింద్‌తో పాటు రాజీవ్ సముద్రంలో కొట్టుకొనిపోయారు. వెంటనే స్పందించిన లైఫ్ గార్డ్స్ వారిని ఒడ్డుకి తీసుకొచ్చారు. అప్పటికే అరవింద్ చనిపోయాడు. రాజీవ్‌‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.

News February 15, 2026

‘ఫుడ్ జిహాద్’ పేరుతో వేధిస్తారా.. ఒవైసీ ఆగ్రహం

image

TG: మేడారం జాతరలో కర్నూలుకు చెందిన చిరువ్యాపారి వలీని వేధించిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. వ్యూస్ కోసం పేద వ్యాపారిని అవమానించడం, మత రంగు పులిమి వేధించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కేవలం రూ.10కి కోవా బన్ను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని ‘ఫుడ్ జిహాద్’ పేరుతో భయభ్రాంతులకు గురిచేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.

News February 15, 2026

కాళేశ్వరంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలించిన ఎస్పీ

image

మహా శివరాత్రి సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ సంకీర్త్ పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున పోలీస్ బందోబస్తును మరింత పటిష్ఠంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పుష్కర ఘాట్, తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు.