News January 17, 2026

బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి: బండి సంజయ్

image

TG: త్వరలో జరగనున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘విజయ సంకల్ప సమావేశం’లో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధికి నయాపైసా రాదని, బీఆర్ఎస్‌కు వేస్తే వృథాయేనని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటేస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.

Similar News

News February 28, 2026

చెరకు పంటలో జింకు లోపం – నివారణ

image

చెరకు పిలకదశలో జింకు లోపం కనిపిస్తే మొక్కల ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడతాయి. లోపం ఎక్కువైతే పెరుగుదల తగ్గి, దుబ్బు చేయడం నిలిచిపోయి, కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యం అవుతాయి. దీని కట్టడికి లోపం కనిపించిన తోటలపై లీటరు నీటికి జింకు సల్ఫేట్ 2గ్రా. కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆఖరి దుక్కిలో ముందే ఎకరాకు 20kgల జింక్ సల్ఫేట్ నేలలో వేస్తే జింకు లోపం రాకుండా నివారించవచ్చు.

News February 28, 2026

IIIT నాగపూర్‌లో పోస్టులు

image

<>IIIT <<>>నాగపూర్‌ 17 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. MLSc, BLSc, BA/BSc/BCom, BE/BTech అర్హత గల అభ్యర్థులు మార్చి 12న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9000, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8000 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://iiitn.ac.in

News February 28, 2026

వేసవి కాలంలో రక్తదానం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

image

వేసవి కాలంలో రక్తదానం చేసేవారు హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. ఇందుకోసం రక్తదానానికి ముందు, తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. పండ్ల రసాలు, గ్లూకోజ్ పానీయాలు తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. రక్తదాన కేంద్రానికి వెళ్లేటప్పుడు ఎండ తగలకుండా గొడుగు/టోపీ/స్కార్ఫ్ ధరించాలి. బ్లడ్ ఇచ్చిన తర్వాత 15-20min రెస్ట్ తీసుకోవాలి. భారీ శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, పప్పులు, ఖర్జూర వంటివి ఆహారంగా తీసుకోవాలి.