News January 18, 2026
కర్నూలులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో రికార్డు అసిస్టెంట్-1, ఫ్రెంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్-1, రెగ్యులర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గడువు ఈనెల 27 వరకు ఉందన్నారు. దరఖాస్తులను రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపాలన్నారు. www.ecourtskurnool.com & kurnool.dcourts.gov.inను చూడాలన్నారు.
Similar News
News February 27, 2026
చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 27)

1931: స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ మరణం(ఫొటోలో)
1932: ఆంగ్లో-అమెరికన్ నటి ఎలిజబెత్ టేలర్ జననం
1932: కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణుడు వేగె నాగేశ్వరరావు జననం
1956: లోక్‌సభ తొలి స్పీకర్ జి.వి.మావలంకర్ మరణం
1972: సినీ నటుడు శివాజీ రాజా పుట్టినరోజు
2002: సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనం, 59 మంది VHP కరసేవకులు మృతి
News February 27, 2026
108 రన్స్ తేడాతో గెలిస్తే సీన్ వేరేలా ఉండేది

T20 WC: భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసినా వెస్టిండీస్ నెట్ రన్ రేట్‌ను మాత్రం దాటలేకపోయింది. ఇండియా 256 రన్స్ చేసినప్పటికీ విండీస్‌ను దాటాలంటే జింబాబ్వేను 148 లోపే కట్టడి చేయాల్సింది. అంటే కనీసం 108 పరుగుల తేడాతో గెలవాల్సింది. దీంతో మార్చి 1న విండీస్‌తో జరిగే మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే రన్ రేట్ తక్కువగా ఉన్న టీమ్‌ఇండియా ఇంటికి వచ్చేస్తుంది.
News February 27, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


