News January 18, 2026
యాదాద్రి: తప్పని సరిగా హాజరు కావాలి: కలెక్టర్

పంచాయతీ శాఖ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని సర్పంచులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. నిర్ణీత తేదీల్లో సర్పంచులందరూ తప్పనిసరిగా హాజరై శిక్షణను విజయవంతం చేయాలని ఆదేశించారు. పాలనపై అవగాహన పెంచుకుని గ్రామాల్లో మెరుగైన సేవలందించేందుకే ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 14, 2026
నంది వాహనంపై కీసరకు శివయ్య ప్రయాణం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తి నంది వాహనంపై కీసరకు వేంచేశారు. ఇది తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం రాత్రి కీసరగుట్ట నుంచి పోలీసు బందోబస్తు నడుమ డప్పు చప్పుళ్లతో ముదిరాజ్ కులస్థులు తమ భుజాలపై హర హర మహాదేవ అంటూ..స్వామి వారిని కీసరగుట్ట నుంచి నడక దారిలో కీసరకు తీసుకువచ్చారు.
News February 14, 2026
ఈ నెల 19 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలు

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి నెలకొననుంది. ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియడంతో 19 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలుకానున్నట్లు పండితులు తెలిపారు. *ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26 *మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12 *ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29 *మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14 *జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29 *జులై: 1, 6, 7, 11 *నవంబర్: 21, 24, 25, 26 *డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12.
News February 14, 2026
తిరుమలగిరిలో తల్లీకొడుకుల విజయం

తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల్లో తల్లీకొడుకులు కౌన్సిలర్లుగా గెలిచి రికార్డు సృష్టించారు. అయితే వీరిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి విజయం సాధించడం విశేషం. 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థినిగా తల్లి బత్తుల శకుంతల గెలవగా, 7వ వార్డు నుంచి కుమారుడు శీను కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. పార్టీలు వేరైనా, ఒకే ఇంట్లో ఇద్దరు విజేతలుగా నిలవడంతో స్థానికంగా ఈ విషయం ఆసక్తికర చర్చకు దారితీసింది.


