News January 18, 2026

HYDలో ఫిబ్రవరి 10 డెడ్‌లైన్

image

మేయర్, పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2026తో ముగియనుంది. అప్పటివరకు విలీన మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల కింద ఉండనుండగా ఫిబ్రవరి 11 నుంచి గ్రేటర్ వ్యవస్థలో సమూల మార్పులు రానున్నాయి. మార్చి నాటికి డివిజన్ల వారీ ఫైనల్ రిజర్వేషన్ గెజిట్ విడుదల చేసి, ఏప్రిల్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది. మున్సిపల్ శాఖ ఇప్పటికే జలమండలి, రెవెన్యూ విభాగాలను దీనికి <<18882564>>అనుగుణంగా<<>> సిద్ధం చేస్తోంది.

Similar News

News March 28, 2026

మూసీ పునరుద్ధరణ: ఆలయానికి సీఎం రేవంత్ శంకుస్థాపన

image

TG: రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఈ నిర్మాణాన్ని మూసీ పునరుద్ధరణలో భాగంగా ప్రభుత్వం చేపడుతోంది. ఆలయంలో వంద అడుగుల గాలి గోపురం, మూసీ నది మధ్యలో వంద అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీజలాలను కాపాడుకోవడం మన బాధ్యత అని సీఎం రేవంత్ చెప్పారు.

News March 28, 2026

ADB: ప్రజలను మభ్య పెట్టారా..?

image

ADB <<19497307>>ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి<<>> ప్రస్తుతం IAF అధీనంలో 369 ఎకరాల స్థలం ఉంది. కాగా పెద్ద విమానాలు దిగేందుకు వీలుగా 3 కి.మీ. నిడివిలో రన్‌వే నిర్మించాల్సి ఉండడంతో అదనంగా మరో 249 ఎకరాల భూములు కావాల్సి ఉంది. ఎయిర్‌పోర్ట్ వచ్చేస్తుందంటూ అటు కాంగ్రెస్ నేతలు, PM చేతుల మీదుగా శంకుస్థాపన అంటూ ఇటు BJP నేతలు పోటాపోటీగా ప్రచారం చేశారు. తాజాగా కేంద్ర మంత్రి ప్రకటనతో అవన్నీ ఉత్తుత్తి మాటలేనని తేలిపోయింది.

News March 28, 2026

ఫ్లెక్సీ ప్రింటర్ మిస్టేక్ వల్లే ఈ పరిస్థితి: ఈవో క్లారిటీ..!

image

పెద్దాపురంలో శ్రీరామ నవమి <<19495145>>ఫ్లెక్సీలో <<>>తలెత్తిన ఫొటోల గందరగోళంపై మహారాణి సత్రం ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ఇది ప్రింటింగ్ పొరపాటేనని, కావాలని చేసింది కాదని స్పష్టం చేశారు. Way2News కథనంపై స్పందిస్తూ, ముప్ఫై ఏళ్లుగా తాను నిజాయతీగా సేవలు అందిస్తున్నానని తెలిపారు. ఫ్లెక్సీల విషయంలో జరిగిన ఈ పొరపాటు పట్ల ఆయన విచారం వ్యక్తం చేస్తూ వివరణ ఇచ్చారు.