News January 18, 2026
మళ్లీ పడిపోయిన ఉష్ణోగ్రతలు

AP: ఇటీవల రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న అరకులోయలో 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు, తూ.గో., ప.గో., అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అతి తక్కువ విజిబిలిటీ నమోదైంది. అన్ని జిల్లాల్లో మంచు దుప్పటి కప్పేసింది. ఇవాళ కూడా దట్టమైన పొగమంచు ఉంటుందని, ఉ.8 గంటల వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Similar News
News April 1, 2026
ఇక మిడిల్ లెవెల్ మేనేజర్లు అవసరం లేదా?

అవుననే అంటున్నారు ట్విటర్ కోఫౌండర్ జాక్ డోర్సే. మేనేజ్‌మెంట్, ఉద్యోగుల మధ్య వారధిగా పనిచేసే వీరి అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వీరు నిర్వహించే కోఆర్డినేషన్, వర్క్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ వంటి పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా సమర్థంగా, వేగంగా చేయగలదని అభిప్రాయపడ్డారు. బిజినెస్ అప్డేట్ సిస్టమ్‌ను ఉపయోగించుకొని వర్క్‌ను కోఆర్డినేట్ చేసుకోగలదని, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని వివరించారు.
News April 1, 2026
యూరినేషన్ తర్వాత చుక్కలు పడుతున్నాయా?

యూరినేషన్ పూర్తయ్యాక కాసేపటికి కొన్ని చుక్కలు పడటాన్ని పోస్ట్ మిక్చురిషన్ డ్రిబుల్(PMD) అంటారు. మధ్య వయస్కుల్లో కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువకుల్లోనూ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రోస్టేట్ వాపు, పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడటం, ఎక్కువగా కూర్చొనే అలవాటుతో ఇది సంభవిస్తుందంటున్నారు. తక్కువస్థాయిలో PMD ప్రమాదకరం కాదని, మూత్రంలో రక్తం, మంట, నొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News April 1, 2026
సెన్సస్: మోదీ సెల్ఫ్ ఎన్యూమరేషన్

దేశవ్యాప్తంగా తొలి దశ జనగణనలో భాగంగా ఇవాళ్టి నుంచి హౌస్ లిస్టింగ్, హౌసింగ్ ఆపరేషన్స్ నమోదు ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ <<19530324>>సెల్ఫ్ ఎన్యూమరేషన్<<>> పూర్తి చేశారు. ఈ ఫొటోలను SMలో పోస్టు చేశారు. ‘సెన్సస్ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుండటం ఇదే తొలిసారి. ఇంటి వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. దేశ ప్రజలంతా ఇందులో భాగం కావాలి’ అని పిలుపునిచ్చారు.


