News April 26, 2024

రైలు టికెట్లపై GOOD NEWS

image

రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. జనరల్ టికెట్ కోసం తీసుకొచ్చిన UTS (అన్-రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్) యాప్‌లో మార్పులు చేసింది. ఎంత దూరం నుంచైనా ఫోన్ లోనే జనరల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో రైల్వేస్టేషన్‌కు 2, 3 కి.మీల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. అయితే స్టేషన్‌కు 50 మీటర్లలోపు ఈ యాప్ పని చేయదు. ఈ యాప్ వల్ల కౌంటర్ల వద్ద వెయిట్ చేయడం తప్పుతుంది.

Similar News

News February 4, 2026

మయన్మార్‌లో భూకంపం.. కోల్‌కతాలోనూ ప్రకంపనలు

image

మయన్మార్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.9గా నమోదైంది. భూకంప తీవ్రత వల్ల బంగ్లాదేశ్, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఇళ్లు, ఆఫీసులు స్వల్పంగా ఊగడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. 71 గంటల్లో మయన్మార్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి.

News February 4, 2026

WPL: ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్

image

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో గుజరాత్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరింది. గుజరాత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎల్లుండి జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, RCB జట్లు తలపడనున్నాయి.

News February 4, 2026

ఉదయాన్నే ఈ 6 పనులతో గుండె ఆరోగ్యం మీ చేతుల్లో!

image

గుండె దృఢంగా ఉండాలంటే ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగి శరీరాన్ని హైడ్రేట్ చేయాలని, చక్కెర తక్కువగా ఉన్న ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘కేవలం 5 నిమిషాల ధ్యానం, కొద్దిసేపు ఎండలో నడవడం, రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తే BP కంట్రోల్‌లో ఉంటుంది. నిద్రలేవగానే కనీసం 30 నిమిషాల పాటు మొబైల్‌కు దూరంగా ఉంటే స్ట్రెస్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని చెబుతున్నారు.