News January 18, 2026

FLASH.. HYD: భార్యను కత్తితో పొడిచిన భర్త

image

మానవ సంబంధాలు దారి తప్పుతున్నాయి. HYD శివారు, దుండిగల్ PS పరిధి డి.పోచంపల్లిలో డాక్టర్ బస్తీలో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మద్యానికి బానిసైన భర్త సాదుల్లా, భార్య సాహిని(30)ని తాగడానికి డబ్బులు అడిగాడు. ఆమె నిరాకరించడంతో విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 17, 2026

మీరేం సాధించారో ఆలోచించుకోండి.. జగన్ ఆగ్రహం

image

AP: మహిళలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించిన పార్టీలను విమర్శిస్తూ YCP చీఫ్ జగన్ ట్వీట్ చేశారు. ‘మీరేం సాధించారో ఓసారి ఆలోచించుకోండి. మహిళా రిజర్వేషన్ల బిల్లు వాయిదా పడింది. అటు దక్షిణాదికి గానీ ఇటు మహిళలకు గానీ న్యాయం జరగలేదు. ఒకవేళ 2026 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది’ అని పేర్కొన్నారు.

News April 17, 2026

మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు: ఐజీ గోపీనాథ్ జట్టి

image

మాదకద్రవ్యాల నిర్మూలనపై విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో ఐదు జిల్లాల ఎస్పీలతో శుక్రవారం సమీక్ష జరిగింది. “సంకల్పం, చైతన్యం, అభ్యుదయం 2.0” పేరుతో 100 రోజుల కార్యాచరణ చేపట్టారు. ఇప్పటివరకు రూ.11.63 కోట్ల ఆస్తులు ఫ్రీజ్ చేశమన్నారు. 72 కేసుల్లో 129 మందికి శిక్షలు పడినట్లు తెలిపారు. డ్రోన్లు, యాప్‌లతో నిఘా పెంచి, 1000 డ్రగ్ ఫ్రీ గ్రామాల లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

News April 17, 2026

HYD‌లో నయా ట్రెండ్ ఇదే!

image

HYDలో నైట్‌లైఫ్ ఇప్పుడు పక్కా క్యాలెండర్ ఈవెంట్‌లా మారిపోయింది. ఐటీ కుర్రాళ్లు, స్టూడెంట్స్ వారం ముందే గెస్ట్ లిస్టులు, టేబుల్స్ బుక్ చేసుకుంటున్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో క్లబ్బింగ్ అంటే ఒక మినీ ఫెస్టివల్‌ను తలపిస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో, రాత్రిపూట తిరగడం కంటే ముందే అన్నీ ప్లాన్ చేసుకోవడానికే యువత ప్రాధాన్యం ఇస్తోంది. పక్కా షెడ్యూల్‌తో ఎంజాయ్ చేయడం ఇప్పుడు ట్రెండ్.